»   » సూపర్ స్టార్ కిడ్నాప్ ఎప్పుడంటే...?

సూపర్ స్టార్ కిడ్నాప్ ఎప్పుడంటే...?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: లక్కీ క్కియేషన్స్ బ్యానర్‌పై ఎ.సత్తిరెడ్డి సత్తిరెడ్డి సమర్పణలో నందు, ఆదర్శ్, భూపాల్, పూనమ్ కౌర్, శ్రద్ధా దాస్ నటీనటులుగా తెరకెక్కుతోన్న చిత్రం 'సూపర్ స్టార్ కిడ్నాప్' . గతేడాదే విడుదల కావాల్సిన ఈ చిత్రం వివిధ కారణాలతో ఆలస్యం అవుతూ వచ్చింది. తాజాగా ఈ చిత్రాన్ని జూన్ లో విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ చిత్రాన్ని చందు పెన్మత్స నిర్మిస్తున్నారు. ఎ.సుశాంత్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. సాయి కార్తీక్ సంగీతం అందించారు. ఇదొక క్రైమ్ థ్రిల్లర్ కామెడీ మూవీ. నందు, ఆదర్శ్, భూపాల్, పూనమ్ కౌర్, శ్రద్ధా దాస్ నటీనటులు.

Superstar Kidnap release date

కొన్ని ఊహించని సంఘటనల వల్ల చిక్కల్లో పడిన ముగ్గురు యువకులు సూపర్ స్టార్ మహేష్ బాబును కిడ్నాప్ చేయాలనుకుంటారు. వాళ్లు వేసుకున్న ప్లాన్ ప్రకారం కిడ్నాప్ చేసారా? లేదా అనేది కథ. క్రామ్ కామెడీ సినిమా సాగుతుంది. ప్రేక్షకులు ఉత్కంఠకు గురి చేసే విధంగా సినిమా ఉంటుంది.

ఈ కామెడీ సినిమాలో శ్రద్ధా దాస్ ఒక రౌడీ పాత్రలో కనిపించనుంది. 'తన పాత్ర 'ఫాస్ గయా రే ఒబామా' అనే హింది సినిమాలో నేహ దుపియా చేసిన పాత్రలా ఉంటుంది.

English summary
Superstar Kidnap releasing in June. Directed by Sushanth Reddy. Nandu, Poonam Kaur, Tejaswi Madivada in the lead roles.
Please Wait while comments are loading...