సూపర్ స్టార్ కిడ్నాప్: రౌడీగా మారిన హాట్ హీరోయిన్..!

By Bojja Kumar

హైదరాబాద్: పాపులారిటీ, పబ్లిసిటీ లేని కొత్త వారు తీసే చిన్న సినిమాలు చూసే పరిస్థితి ఇండస్ట్రీలో లేదనే చెప్పాలి. అందుకే ఇలాంటి సినిమాల వైపు ప్రేక్షకులను వచ్చేలా రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు ఫిల్మ్ మేకర్స్. అలాంటి ప్రయత్నమే చేస్తున్నారు 'సూపర్ స్టార్ కిడ్నాప్' చిత్రాన్ని తెరకెక్కిస్తున్న దర్శక నిర్మాతలు. మహేష్ బాబును కొడ్నాప్ చేయాలనే కథాంశంతో ఈ సినిమా రాబోతోంది.

మహేష్ బాబును కిడ్నాప్ చేసే కథ అనగానే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొనడం సహజమే. ఇటీవల విడుదలైన ఈచిత్రం డిజిటల్ పోస్టర్ కూడా మహేష్ బాబు మాస్కులతో ఉన్న వ్యక్తులతో ఆకట్టుకుంటోంది. ఎ.సత్తిబాబు సమర్పణలో లక్కీ క్రియేషన్స్ పతాకంపై చందు పెన్మత్స నిర్మాతగా రూపొందుతున్న చిత్రం 'సూపర్ స్టార్ కిడ్నాప్'.

Superstar Kidnap: Shraddha Das played as a powerful goon

నందు ఆదర్శ్, భూపాల్, పూనమ్ కౌర్, శ్రద్ధాదాస్ నటీనటులు. ఎ.సుశాంత్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. మహేష్ బాబును కిడ్నాప్ చేయాలనే కథతో ఈ సినిమా సాగుతుంది. ఈ కామెడీ సినిమాలో శ్రద్ధా దాస్ ఒక రౌడీ పాత్రలో కనిపించనుంది. 'తన పాత్ర 'ఫాస్ గయా రే ఒబామా' అనే హింది సినిమాలో నేహ దుపియా చేసిన పాత్రలా ఉంటుందని', శ్రద్ధా అన్నారు. ప్రస్తుతం హైదరబాద్ లో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ లో శ్రద్ధా దాస్ పాల్గొంటున్నారు. సుశాంత్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని చందు పెన్మట్స నిర్మిస్తున్నారు.

దర్శకుడు మాట్లాడుతూ...కొన్ని ఊహించని సంఘటనల వల్ల చిక్కల్లో పడిన ముగ్గురు యువకులు సూపర్ స్టార్ మహేష్ బాబును కిడ్నాప్ చేయాలనుకుంటారు. వాళ్లు వేసుకున్న ప్లాన్ ప్రకారం కిడ్నాప్ చేసారా? లేదా అనేది కథ. క్రామ్ కామెడీ సినిమా సాగుతుంది. ప్రేక్షకులు ఉత్కంఠకు గురి చేసే విధంగా సినిమా ఉంటుంది అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X