సూపర్ స్టార్ కృష్ణకు వెన్నెముక నొప్పి, శస్త్రచికిత్స
సీనియర్ నటుడు సూపర్ స్టార్ కృష్ణ ఆసుపత్రిలో చేరారు. గత కొంత కాలంగా వెన్నెముక నొప్పితో బాధపడుతున్న ఆయన పరిస్థితి తీవ్రంగా మారడంతో... సోమవారం యశోద ఆసుపత్రిలో చేరారు. డాక్టర్ సంజయ్ నేతృత్వంలోని వైద్య బృందం ఆయనకు సర్జరీ చేశారు. కృష్ణ ప్రస్తుతం ఐసీయులో ఉన్నాడని, సాయంత్రం ఆయన్ను జనరల్ వార్డుకు తరలిస్తామని వైద్యులు ప్రకటించారు.
కృష్ణ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, అభిమానులు ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని, రెండు మూడు రోజుల్లో ఆయన్ను డిశ్చార్జి చేస్తామని యశోద ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. సూపర్ స్టార్ కృష్ణకు పెద్ద యెత్తున అభిమానులు ఉన్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











