twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వాటి వల్లే కేసీఆర్ గెలిచారు.... సూపర్ స్టార్ కృష్ణ సంచలన ప్రకటన!

    |

    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి అఖండ విజయం అందుకుని రెండో సారి ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టబోతున్న కేసీఆర్‌కు కంగ్రాంట్స్ చెబుతూ సూపర్ స్టార్ కృష్ణ ఓ ప్రెస్ నోట్ విడుదల చేయడం హాట్ టాపిక్ అయింది.

    నాలుగున్నరేళ్ల కాలం పరిపాలన తర్వాత ఇంత అత్యధిక స్థానాల్లో విజయం సాధించి మళ్లీ అధికారంలోకి రావడం చాలా గొప్ప విషయం.. అంటూ కృష్ణ ప్రశంసలు గుప్పించడం సర్వాత్రా చర్చీనీయాంశం అయింది.

    వాటి వల్లే కేసీఆర్ గెలిచారు

    వాటి వల్లే కేసీఆర్ గెలిచారు

    కేసీఆర్ గారు ప్రవేశ పెట్టిన పథకాలన్నీ ప్రజలకు ఎంతో మేలు చేశాయి. అందుకే అన్ని వర్గాల ప్రజలు ఆయనకి ఈ అఖండ విజయాన్ని అందించారు. మళ్లీ రెండోసారి తెలంగాణకి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతున్న చంద్రశేఖర్ రావు గారికి నా హృదయ పూర్వక అభినందనలు.. అని కృష్ణ పేర్కొన్నారు.

    రెండు రోజుల క్రితం అభిమానులతో కృష్ణ ఏమన్నారంటే..?

    రెండు రోజుల క్రితం అభిమానులతో కృష్ణ ఏమన్నారంటే..?

    అసెంబ్లీ ఎన్నికల తర్వాత కొందరు అభిమానులు తనను కలవడానికి రాగా... కృష్ణ వారితో సమావేశం అయ్యారు. ఆ సందర్భంగా తెలంగాణ ఎన్నికల ప్రస్తావన వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా కృష్ణ కారుకే ఓటు వేసినట్లు వెల్లడించారట.

    అల్లుడు ఆ పార్టీ అయినా...

    అల్లుడు ఆ పార్టీ అయినా...

    కృష్ణ, మహేష్ బాబు తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రంలో చేస్తున్న అభివృద్ధి పనులపై పూర్తి సంతృప్తిగా ఉన్నారు. వారి కుటుంబంలో అల్లుడు గల్లా జయదేవ్ తెలుగుదేశం పార్టీల్లో ఉన్నప్పటికీ వీరు మాత్రం టీఆర్ఎస్ ప్రభుత్వానికి మద్దతుగా ఉంటూ వచ్చారు.

    సుధీర్ బాబు ట్వీట్

    కేసీఆర్, కేటీఆర్‌లను అభినందిస్తూ... సుధీర్ బాబు ట్వీట్. గుడ్ గవర్నెన్స్ వల్లే ప్రజలు పట్టం కట్టారని ఈ సందర్భంగా సుధీర్ బాబు చెప్పుకొచ్చారు.

    English summary
    Superstar Krishna congratulates KCR on Historic Win in Telangana elections. "Congratulations #KCR garu & KTRTRS garu ... Statesmanship and the good governance have earned yet another opportunity for you people to serve the public. Great power and greater responsibility in your hands." Sudheer Babu tweeted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X