సూపర్ స్టార్ కృష్ణ హెల్త్ బులిటెన్.. ఆయన శరీరం సహకరిస్తుందో చెప్పలేం, ప్రతి గంటా కీలకమే

సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోవడంతో హైదరాబాద్ గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్ లో చేరిన విషయం తెలిసిందే. సూపర్ స్టార్ కృష్ణ శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఆస్పత్రిలో చేరినట్లు వార్తలు వచ్చాయి. దీంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. అయితే ప్రస్తుతం ఆయన పరిస్థితి బాగుందని త్వరలోనే డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు చెప్పారని సీనియర్ నటుడు నరేష్ తెలిపినట్లు వార్తలు వినిపించాయి. అయితే తాజాగా సూపర్ స్టార్ కృష్ణ హెల్త్ కండిషన్ పై హెల్త్ బులిటెన్ విడుదల చేశారు డాక్టర్ గురు ఎన్ రెడ్డి. ఆయన పరిస్థితి ఎలా ఉందనే తదితర విషయాలను ఆయన చెప్పారు.

గుండెపోటుతో ఆస్పత్రిలోకి..

గుండెపోటుతో ఆస్పత్రిలోకి..

సూపర్ స్టార్ కృష్ణ అనారోగ్యంతో గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్ లో చేరినట్లు తెలిసిన విషయమే. అయితే ముందుగా సూపర్ స్టార్ కృష్ణకు శ్వాసకోశ సంబంధిత సమస్య తలెత్తడంతో నిన్న ఆస్పత్రిలో చేర్పించినట్లు వార్తలు వచ్చాయి. అంతేకాకుండా ఆయన రెగ్యులర్ హెల్త్ చెకప్ కోసం హాస్పిటల్ కు వెళ్లినట్లు తెలిపారు. అలాగే 24 గంటల తర్వాత గానీ, ఇవాళ సాయంత్రం కానీ డిశ్చార్జ్ చేస్తామని వెల్లడించారు.

కానీ తాజాగా సూపర్ స్టార్ కృష్ణ హెల్త్ బులిటెన్ ను విడుదల చేశారు డాక్టర్ గురు ఎన్ రెడ్డి. సూపర్ స్టార్ కృష్ణకు గుండెపోటు రావడంతో ఆస్పత్రిలో జాయిన్ చేసినట్లు తెలిపారు. అలాగే ఆయన ఆరోగ్య పరిస్థితి, ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తాం వంటి తదితర విషయాలను ఆయన చెప్పుకొచ్చారు.

మరో 24 గంటల తర్వాత..

మరో 24 గంటల తర్వాత..

"సూపర్ స్టార్ కృష్ణకు గుండెపోటు వచ్చింది. ఆయన్ను అర్ధరాత్రి నమ్రతా తీసుకొచ్చారు. అప్పుడు ఆయన స్పృహలో లేరు. కృష్ణను ఆసుపత్రికి తీసుకురాగానే ఎమర్జెన్సీ విభాగాంలో వైద్యం అందించాం. 20 నిమిషాల పాటు సీపీఆర్ చేసి గుండెపోటు నుంచి బయటపడేలా చేశాం. ప్రస్తుతం వెంటిలేటర్ పై ఐసీయూలో చికిత్స అందిస్తున్నాం.

ఆయన చాలారోజులుగా మా వద్ద చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం అత్యంత క్లిష్టమైన పరిస్థితులో ఉన్నారు. చికిత్సకు ఆయన శరీరం సహకరిస్తుందా లేదా అనేది ఊహించి చెప్పలేం. ఇప్పటి నుంచి ప్రతి గంటా కీలకమే. 24 గంటలు దాటితే కానీ చెప్పలేం. 24 గంటల తర్వాత మళ్లీ హెల్త్ బులిటెన్ విడుదల చేస్తాం" అని డాక్టర్ గురు ఎన్ రెడ్డి వెల్లడించారు.

50 ఏళ్లకు పైగా సినీ జీవితం..

50 ఏళ్లకు పైగా సినీ జీవితం..

సూపర్ స్టార్ కృష్ణ ఆస్పత్రిలో ఉండటంతో ఆయన బంధువలు హాస్పిటల్ కు తరలి వస్తున్నారు. ఆయనతు అతి సన్నిహితులు అంతా ఆస్పత్రిలో ఉన్నారని వైద్యులు తెలిపారు. కాగా సూపర్ స్టార్ కృష్ణకు గత రాత్రి గుండెపోటు వచ్చినట్లు తెలుస్తోంది. ఆయన్ను మహేశ్ బాబు సతీమణి నమ్రతా కాంటినెంటల్ హాస్పిటల్ కు హుటాహుటీనా తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.

సూపర్ స్టార్ కృష్ణ తిరుగులేని అభిమాన గణాన్ని సంపాదించుకున్నారు. సుమారు 50 ఏళ్లకుపైగా సినీ జీవితంలో 300కి పైగా సినిమాల్లో నటించారు. ఇటీవల కృష్ణ మొదటి భార్య ఇందిరా దేవి మరణించిన విషయం తెలిసిందే. అంతకుముందు రెండో భార్య విజయ నిర్మల, పెద్ద కొడుకు రమేష్ బాబు మరణాలు సంభవించాయి. ఇలా ఒకరి తర్వాత ఒకరు కృష్ణకు దూరం అవుతున్నారు. అంతేకాకుండా ఇటీవల ఆయన మిత్రుడు కృష్ణంరాజు కూడా కన్నుమూయడంతో కృష్ణ కుంగిపోయినట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X