'దూకుడు' కలెక్షన్స్ పై సూపర్ స్టార్ కృష్ణ
మహేష్ 'దూకుడు' మొత్తంగా రూ. 100 కోట్లని వసూలు చేస్తుందని అంచనా వేశారు సీనియర్ సూపర్‌స్టార్ కృష్ణ. ఆయన మాట్లాడుతూ "ఈ సినిమా ఇంత హిట్టవడానికి చాలా కారణాలున్నాయి. ఈ సినిమా చూసే వాళ్లలో క్లాస్ ఆడియెన్స్, మాస్ ఆడియెన్స్ ఉన్నారు. యూత్ ఉన్నారు. పిల్లలున్నారు. లేడీస్ ఉన్నారు. అన్ని రకాల ప్రేక్షకులకి నచ్చింది కాబట్టే ఈ సినిమా ఇంత పెద్ద హిట్టయింది. ఇందులో పిక్చర్ మొదలు పెట్టినప్పట్నించీ ముగింపు వచ్చేవరకూ అందరిచేతా నవ్వించారు. ఆర్టిస్టులంతా చాలా బాగా నటించారు. అన్ని సినిమాల్లోకంటే మహేష్ ఈ సినిమాలో చాలా అందంగా ఉన్నాడు. చాలా బాగా చేశాడు. 'పోకిరి' చూసిన వెంటనే రూ. 40 కోట్లు వసూలు చేస్తుందని చెప్పాను. అదే జరిగింది. 75 సంవత్సరాల రికార్డుల్ని బద్దలుకొట్టిన సినిమా 'పోకిరి' అన్నారు.
ఇప్పుడు 'దూకుడు' మార్నింగ్ షో చూడగానే ఇంటికొచ్చి మహేష్‌కి ఫోన్ చేశా. అప్పుడు శ్రీను వైట్ల కూడా మహేష్ పక్కనే ఉన్నాడు. ఆ ఇద్దరికీ కంగ్రాట్స్ చెప్పి రూ. 80 కోట్లకు పైగా షేర్ వసూలు చేస్తుందని చెప్పాను. ఈ రోజున ఈ సినిమా ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు, కర్ణాటకలోనూ, తమిళనాడులోనూ, ఒరిస్సాలోనూ, నార్త్ ఇండియాలోనూ, విదేశాల్లో కూడా రికార్డులు బద్దలుకొట్టింది. నేననుకున్నట్లు రూ. 80 కోట్లు కాదు, రూ. 100 కోట్లు ఈ సినిమా కలెక్ట్ చేయబోతోంది. కలెక్షన్ల విషయంలో 80 ఏళ్ల తెలుగు సినిమా చరిత్రని తిరగరాయబోతోంది'' అని చెప్పారు.అలాగే విజయనిర్మల మాట్లాడుతూ "ఈ సినిమా చూస్తూ నన్ను నేను మర్చిపోయాను. ఏ సినిమానైనా నేను ఒక్కసారే చూస్తా. దీన్ని ఇప్పటికే రెండుసార్లు చూశా. మహేష్ సిన్సియర్ ఆర్టిస్ట్. సీరియస్‌గా మొహం పెట్టి కామెడీ డైలాగులతో నవ్వించాడు. ఇందులో మహేష్ అందం చూసి నాకే కుళ్లుగా ఉంది'' అన్నారామె.


Click it and Unblock the Notifications











