మహేష్ బాబు తప్పు చేసాడంటున్న కృష్ణ
మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా సూపర్ స్టార్ కృష్ణ,విజయనిర్మలని ఓ ఛానెల్ వారు ఇంటర్వూ చేసారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ..మహేష్ గతంలో సినిమాలు ఒప్పుకునే విషయంలో చాలా తప్పులు చేసాడని,ముఖ్యంగా నాని విషయంలో అని అన్నారు. తనకు తెలియకుండా నాని చిత్రం ఒప్పుకున్నాడని, తాను కనుక ఆ స్క్రిప్టు విని ఉంటే ఆ సినిమా చేయకుండా తప్పకుండా ఆపుచేసి ఉండేవాడిని అని ఆయన అన్నారు. అలాగే ప్రస్తుతం తాను, విజయ నిర్మల కొన్ని స్క్రిప్టులు వింటున్నామని, పద్మాలయా స్టూడియోస్ పై మహేష్ హీరోగా చేసే సినిమా గురించి అని అన్నారు. అలాగే ఆ చిత్రం గతంలో తాను చేసిన జేమ్స్ బాండ్, స్పై చిత్రాల తరహాలో ఉండేలా చూస్తున్నామన్నారు. అలాగే అన్నీ కుదిరితే వచ్చే సంవత్సరమే ఆ సినిమా ఉంటుందన్నారు.
మహేష్ బాబు కృష్ణ విజయనిర్మల జేమ్స్ బాండ్ ఖలేజా మంజుల ఎస్ జె సూర్య krishna mahesh babu vijaya nirmala nani khaleja manjula sj surya


Click it and Unblock the Notifications