twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ట్రాఫిక్ రూల్స్ ఉల్లఘించిన మహేష్, బాలయ్య.. పవన్‌కు రూ. 505 ఫైన్!

    |

    Recommended Video

    Pawan Kalyan,Balakrishna,Mahesh Babu Was Charged With Traffic Fines | Filmibeat Telugu

    హైదరాబాద్ పోలీసులు ట్రాఫిక్ నిబంధనలపై ద్రుష్టి పెట్టారు. నిబంధలను పాటించని ప్రముఖులపై కొరడాఝుళిపిస్తున్నారు. ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా భాద్యత రాహిత్యంగా వాహనాల్లో వెళ్లిన టాలీవుడ్ సినీ ప్రముఖుల జాబితాని హైదరాబాద్ పోలీసులు వెల్లడించారు. వీరిలో కొంత మందికి ఎన్నిసార్లు ఫైన్ విధించిన డబ్బు చెల్లించలేకపోతున్నారని పోలీసులు తెలిపారు. ఈ జాబితాలో సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నందమూరి బాలకృష్ణతో పాటు మరికొంతమంది హీరోలు ఉన్నారు.

     మూడేళ్ళలో మహేష్ బాబు 7 సార్లు

    మూడేళ్ళలో మహేష్ బాబు 7 సార్లు

    ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిలో మహేష్ బాబు ముందు వరుసలో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. మహేష్ బాబు గత మూడేళ్ళ కాలంలో 7 సార్లు ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మూడేళ్ళ కాలంలో మహేష్ బాబుకు చెందిన ఏపీ 09 సిఎం 4005 నెంబరు కారుపై 8,745 రూపాయలు జరిమానా నమోదై ఉంది. కానీ మహేష్ బాబు ఇంతవరకు జరిమానా చెల్లించలేదు. ఇకపై జరిమానా చెల్లినచకుంటే కఠిన చర్యలు ఉంటాయని మహేష్ బాబు అంటున్నారు.

     పవన్ కళ్యాణ్, బాలయ్య ఎంతో తెలుసా

    పవన్ కళ్యాణ్, బాలయ్య ఎంతో తెలుసా

    చలానాలు చెల్లించని వారి జాబితాలో పవన్ కళ్యాణ్, బాలకృష్ణ పేర్లు కూడా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ కు చెందిన కారు నంబరు ఏపీ 09 సీజీ 7778 పై మూడుసార్లు చలానా విధించబడింది. ఈ మేరకు పవన్ ట్రాఫిక్ చలానా కింద రూ.505 బకాయి పడ్డట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ కు మాదాపూర్, బంజారా హిల్స్ పోలీసులు ఈ చలానా విధించారు. ఇక నందమూరి బాలకృష్ణ పై రాజేంద్రనగర్ లో ఫైన్ విధించబడింది. బాలయ్య అతివేగంతో ప్రయాణించిన కారణంగా 1,035 రూపాయలు జరిమానా విధించారు.

    ఔటర్ రింగ్ రోడ్‌పై సునీల్ వేగం

    ఔటర్ రింగ్ రోడ్‌పై సునీల్ వేగం

    ఇక యంగ్ హీరో నితిన్ పై కూడా జరిమానా నమోదై ఉంది. అల్వాల్ ఏరియాలో నితిన్ ట్రాఫిక్ రూల్స్ ని బ్రేక్ చేసినందుకు గాను రూ 1,035 జరిమానాని పోలీసులు విధించారు. కమెడియన్, హీరో సునీల్ మాదాపూర్, ఔటర్ రింగ్ రోడ్డులో అతివేగంతో వాహనాన్ని నడిపిన కారణంగా ఇప్పటివరకు జరిమానా రూపంలో రూ 4,540 బకాయి పడ్డట్లు తెలుస్తోంది. పోలీసులు ఈ వివరాలతో సదరు హీరోలని మరోమారు హెచ్చరించారు. చలానాలు చెల్లించాలని ఆదేశించారు.

    10కి మించితే

    10కి మించితే

    10 చలనాలు మించి నమోదైతే వారిపై కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేస్తాం అని పోలీసులు హెచ్చరించారు. 30 చలానాలకు మించితే వాహనాన్ని సీజ్ చేయడంతో పాటు, కేసు నమోదు అవుతుందని తెలిపారు. పోలీసులు ట్రాఫిక్ నిభందలపై ఎన్ని చైతన్య వంతమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా పరిస్థితి మారడం లేదు. ఈ విషయంలో ప్రక్షాళన అవసరం అని, సెలెబ్రిటీల నుంచే అది ప్రారంభం కావాలని పోలీసులు చెబుతున్నారు.

    English summary
    SuperStar Mahesh Babu breaks traffic rules 7 times. Pawan Kalyan, Balayya also in the list
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X