»   » అమ్మో...! పిల్ల పిడుగు స్టార్ చెఫ్ రేంజ్ లో చాక్లేట్ తయారు చేసిన మహేష్ బాబు కూతురు

అమ్మో...! పిల్ల పిడుగు స్టార్ చెఫ్ రేంజ్ లో చాక్లేట్ తయారు చేసిన మహేష్ బాబు కూతురు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రిన్స్ మహేష్ కూతురు సితార షెఫ్ గా అయ్యింది. వంట గదిలో కుస్తీలే పట్టలేదండీ.. సరదాగా చాక్లెట్ కేక్ తయారు చేసింది. తన చిట్టి చేతులతో కేక్ స్టిక్ పట్టుకుని అదరగొట్టేసింది. షెఫ్ గెటప్ లోని సితార చాక్లెట్ అంత ముద్దుగా ఉంది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ప్రిన్స్ అభిమానులు దసరా పండుగ చేసుకుంటున్నారు. చాక్లెట్ మేకర్స్.. ఈ గ్యాంగ్ అక్కడున్న మొత్తం చాక్లెట్ తినేసింది అని నమ్రత తన ముద్దుల కూతురు గెటప్ కు కామెంట్ చేసింది.

Superstar Mahesh Babu daughter sitara making chocolate

సితార ఎప్పుడు ఏం చేసినా కూడా క్యూట్ గా అల్లరిగా బాగుంటుంది. గతంలో ఒక అవార్డ్స్ ఫంక్షన్ స్టేజీపై డ్యాన్సుతో అందరినీ అవాక్కయ్యేలా చేసింది. ఆ తరువాత నమ్రత షేర్ చేసిన ఏ ఫోటో చూసినా కూడా సితార చిలిపి అల్లరి భలే గమ్మత్తుగా ఉంటుంది. ఈ మధ్య ఎంతో ముద్దుగా ఉండే తన చిన్నారి సితార క్యాప్‌ పెట్టుకుని, చాక్‌లెట్‌ తయారు చేస్తున్న ఫోటోలను నమ్రత ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు.

ఒక నెల మొత్తం విహార యాత్ర కోసం విదేశాలకు వెళ్తుంటారు. మహేష్ బాబు తనయుడు గౌతమ్ నేనొక్కడినే సినిమాలో కూడా నటించాడు. ఇక ఆయన కూతురు సితార విషయానికి వస్తే.. చాలా అల్లరి పిల్ల అని ఓ సందర్భంలో మహేష్ అన్నారు. నిజంగానే కొన్ని ఆడియో ఫంక్షన్లో, ప్రైవేట్ కార్యక్రమాల్లో తార చేసే అల్లరి అంతా ఇంతా కాదు. ఇప్పటికే మహేష్ బాబు నటించిన సినిమాలోని పాటలకు డ్యాన్స్ చేస్తూ సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది.

Superstar Mahesh Babu daughter sitara making chocolate

తాజాగా మహేష్ ముద్దుల కూతురు ఏంచేసిందో తెలిస్తే షాక్ అవుతారు. ఈ అమ్మడు ఓ చాక్లేట్ తయారు చేసి అందరికీ ఆశ్చర్యపరిచింది. చాక్లెట్ తయారు చేయడమే కాకుండా వాటిని ఇతరులకు తినిపించి సూపర్ గా చేసావ్ అని మెప్పు కూడా పొందింది. అయితే సితార ఆ చాక్లెట్ ని చేయలేదు లెండి తయారీ దారుడి సహకారంతో ఎలా చేయాలో తెలుసుకొని మరీ చేసింది. తన పాప చాక్లెట్ చేస్తుంటే నమ్రత పట్టలేని ఆనందంతో చప్పట్లు కొట్టింది. అంతే కాదు తన ఆనందాన్ని సంతోషాన్ని అభిమానులతో పంచుకోవడానికి సితార ఫోటోలను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది .

English summary
Here is a Chocolate story of Sitara, Actually the little cute girl went to make Chocolate along with her friends in a Bakery. Instead of prepping Chocolate, she used to eat away the chocolate which was there to prepare.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu