Super Star Krishna: ఆస్పత్రిలో చేరిన సూపర్ స్టార్ కృష్ణ, ఇండస్ట్రీలో కలకలం.. ఆందోళనలో ఫ్యాన్స్

సీనియర్ నటుడు, నిర్మాత, దర్శకుడు సూపర్ స్టార్ కృష్ణ తెలుగు సినీ చరిత్రలో ఒక ట్రెండ్ సెట్టర్. సంచలనాల సినిమాలకు, సాహస తరహా కథలకు పెట్టింది పేరు. విభిన్నమైన స్టోరీస్ ను తెలుగు చిత్రసీమకు తీసుకొచ్చిన హీరో. నటుడిగా మొదలైన కృష్ణ సినీ జీవితంలో దర్శకుడిగా మారి ఎన్నో సినిమాలు తెరకెక్కించారు. నిర్మాతగా మారి విభిన్నకథా చిత్రాలను అందించారు. పద్మాలయ స్టూడియోను నిర్మించి ఎన్నో సినిమాలకు ప్రాణం పోశారు. భారతీయ సినిమా రంగంలో ఒక లెజెండ్ గా సూపర్ స్టార్ కృష్ణ ఎదిగారు. అయితే తాజాగా ఆయన అనారోగ్యం పాలైనట్లు తెలుస్తోంది. ఆ వివరాళ్లోకి వేళితే..

వైద్యుల పర్యవేక్షణలో..

వైద్యుల పర్యవేక్షణలో..

సూపర్ స్టార్ కృష్ణ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. అస్వస్థతకు గురైన ఆయనను గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్ లో చేర్చినట్లు టాలీవుడ్ నుంచి వచ్చిన సమాచారం. ప్రస్తుతం సూపర్ స్టార్ కృష్ణ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నారని తెలుస్తోంది. అయితే సూపర్ స్టార్ కృష్ణ రెగ్యులర్ చెకప్ కోసం హాస్పిటల్ కి వెళ్లినట్లు అంటున్నారు.

సూపర్ స్టార్ కృష్ణ గత కొంతకాలంగా శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆయనను హాస్పిటల్ జాయిన్ చేశారు. ప్రస్తుతం సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని టాలీవుడ్ మీడియా వర్గాలు చెబుతున్నాయి.

ఇండస్ట్రీలో కలకలం..

ఇండస్ట్రీలో కలకలం..

సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండడంతో ఈరోజు సాయంత్రం డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందని వైద్యులు తెలిపారట. ఈ విషయంపై సీనియర్ నటుడు నరేష్ మాట్లాడారు. శ్వాస సంబంధిత సమస్యతోనే నిన్న ఆస్పత్రిలో చేర్పించినట్లు ఆయన పేర్కొన్నారు.

మరో 24 గంటల తర్వాత సూపర్ స్టార్ కృష్ణను ఆస్పుత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తారని వెల్లడించారు. ఇక ఇదిలా ఉంటే సూపర్ స్టార్ కృష్ణ ఆస్పత్రిపాలుకావడంతో ఇండస్ట్రీలో కలకలం రేగింది. అలాగే సూపర్ స్టార్ కృష్ణ అభిమానులు ఆందోళనకు గురయ్యారు.

అయితే కృష్ణ జనరల్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లారని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉండటంతో అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. త్వరలో మహేశ్ బాబు ఆస్పత్రికి చేరుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

బాధతోపాటు అనారోగ్యం..

బాధతోపాటు అనారోగ్యం..

ఇటీవల కృష్ణ మొదటి భార్య ఇందిరా దేవి మరణించిన విషయం తెలిసిందే. అంతకుముందు రెండో భార్య విజయ నిర్మల, పెద్ద కొడుకు రమేష్ బాబు మరణాలు సంభవించాయి. ఇలా ఒకరి తర్వాత ఒకరు కృష్ణకు దూరం అవుతున్నారు. అంతేకాకుండా ఇటీవల ఆయన మిత్రుడు కృష్ణంరాజు కూడా కన్నుమూయడంతో కృష్ణ కుంగిపోయినట్లు తెలుస్తోంది. బాధతోపాటు వయసు రీత్యా వచ్చే సమస్యలు, అనారోగ్యం కృష్ణపై ప్రభావం చూపిస్తున్నాయని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X