ఫ్యాన్ మూమెంట్: 106 ఏళ్ల బామ్మ కోరిక తీరింది, మహేష్ బాబు భావోద్వేగం...

Recommended Video

Superstar Mahesh Babu Interacts With His 106yr Old Fan | Filmibeat Telugu

మహేష్ బాబుకు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే అందులో వందేళ్ల వయస్సు దాటిన వారు కూడా ఉన్నారంటే ఆశ్చర్యమే. రాజమహేంద్రవరానికి చెందిన రేలంగి సత్యవతి అనే 106 ఏళ్ల బామ్మకు మహేష్ బాబు అంటే పిచ్చి అభిమానం. చాలా కాలంగా మహేష్ బాబును చూడాలని ఆశ పడుతోంది. నిద్రలోనూ మహేష్ బాబు పేరునే కలవరిస్తోంది. చనిపోయేలోపు ఒక్కసారైనా తన అభిమాన నటుడిని చూడాలనేది ఆమె కోరిక. ఈ విషయం సోషల్ మీడియా, టీవీ ఛానల్స్ ద్వారా సూపర్ స్టార్ చెవిన పడింది. వెంటనే ఆమెను కలిసేందుకు ఏర్పాట్లు చేశారు.

 ‘మహర్షి' సెట్స్‌లో కలిసి మహేష్ బాబు

‘మహర్షి' సెట్స్‌లో కలిసి మహేష్ బాబు

106 ఏళ్ల బామ్మను కలిసేందుకు మహేష్ బాబు ఏర్పాటు చేయడంతో రాజమహేంద్రవరం నుంచి రేలంగి సత్యవతమ్మను హైదరాబాద్‌లో ‘మహర్షి' మూవీ సెట్స్‌కు తీసుకొచ్చారు. బామ్మను కలిసిన ఫోటోలను మహేష్ బాబు సోషల్ మీడియాలో షేర్ చేశారు.

మహేష్ బాబు భావోద్వేగం...

మహేష్ బాబు భావోద్వేగం...

సాధారణంగా అభిమానులు సూపర్ స్టార్‌ను కలవగానే భావోద్వేగానికి గురవుతారు. అయితే ఇక్కడ మాత్రం మహేష్ బాబు వంతైంది. ఏళ్లు గడుస్తున్నా నాపై ఉన్న ప్రేమ మరింత ఎక్కువవడం చూస్తే ఎంతో ముచ్చటేస్తోంది. మీ అభిమానం నాకెప్పుడూ సంతోషాన్ని కలిగిస్తుంది అని మహేష్ బాబు ట్వీట్ చేశారు.

 నా హృదయంలోని ప్రతి మూలను టచ్ చేశారు

నా హృదయంలోని ప్రతి మూలను టచ్ చేశారు

రాజమండ్రి నుంచి ఇంత దూరం వచ్చి సత్యవతిగారు నన్ను ఆశీర్వదించారు. నా హృదయంలోని ప్రతి మూలను ఆమె టచ్ చేశారు. ఈ రోజు చాలా సంతోషంగా ఉంది అని మహేష్ బాబు తెలిపారు.

ఆమెకంటే నేనే ఎక్కువ సంతోష పడ్డాను

ఆమెకు సంతోషం కలిగించే ఈ మీటింగ్ జరిగినందుకు సంతోషంగా ఉంది. కానీ నిజాయితీగా చెప్పాలంటే ఆమెకంటే ఎక్కువ సంతోషం నాలో కలిగింది అని మహేష్ బాబు తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X