ఫోటోలు: మహేష్ ముద్దుల కుమార్తె సితార బర్త్ డే సెలెబ్రేషన్స్.. స్పెషల్‌గా కేక్!
Recommended Video

Mahesh's Daughter Sitara Birthday Celebrations
సూపర్ స్టార్ మహేష్ బాబు ముద్దుల కుమార్తె సితార పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. సితార ఆరేళ్ళు పూర్తి చేసుకుని ఏడవ ఏటలోకి అడుగుపెట్టింది. స్టార్ హోటల్ లో సితార బర్త్ డే ని ఘనంగా నిర్వహించారు. సూపర్ స్టార్ మహేష్ సితార బర్త్ డే కోసం ప్రత్యేకంగా కేక్ తయారు చేయించినట్లు తెలుస్తోంది.

కేక్ పై మహేష్ బాబు ఫ్యామిలీ ఫోటో ఉండేలా డిజైన్ చేశారు. సితార బర్త్ డేకి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మహేష్ తన ముడుల కూతురితో ఎప్పుడూ సరదాగా ఉంటాడు. ఈ ఫొటోలో మహెష్ సతీమణి నమ్రత, గౌతమ్ కూడా ఉన్నారు.
సినిమాల విషయాన్ని వస్తే మహేష్ ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు గడ్డం, మీసాలతో సరికొత్త గెటప్ లో కనిపిస్తున్నారు. ఇప్పటి నుంచే ఈ చిత్రంపై భారీగా అంచనాలు పెరుగుతున్నాయి.


Click it and Unblock the Notifications











