అభిమానులకు మహేష్ బాబు బహిరంగ లేఖ
హైదరాబాద్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన అభిమానులకు బహిరంగ లేఖ రాసారు. ఈ నెల 10న మహేష్ బాబు నటిస్తున్న '1-నేనొక్కడినే' చిత్రం విడుదల అవుతున్న నేపథ్యంలో ఈ లేఖ విడుదల చేసారు. అభిమానులకు నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. లేఖ పూర్తి పాఠం..
ప్రియమైన అభిమాన మిత్రులకు,
14 రీల్స్ ఎంర్టెన్మెంట్స్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర సంయుక్తంగా సుకుమార్ దర్శకత్వంలో నిర్మిస్తున్న '1 నేనొక్కడినే' చిత్రం దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఆడియో లహరి ద్వారా విడుదలై సంచలనం సృష్టించి సూపర్ హిట్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది.
జనవరి 10న సంక్రాంతి కానుకగా విడుదలయ్యే '1 నేనొక్కడినే' చిత్రం చూసి మీ అభిప్రాయాలు తెలియజేయగలరు.
శ్రీను వైట్ల దర్శకత్వంలో 14 రీల్స్ సంస్థ నిర్మించే 'ఆగడు' చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. వేసవి శెలవులలో మిమ్మల్ని అలరిస్తుంది. నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో...
- సదా మీ శ్రేయోభిలాషి
జి. మహేష్ బాబు.
సంక్రాంతి కానుకగా విడుదల కాబోతోన్న మహేష్ బాబు '1-నేనొక్కడినే' చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ జారీ చేసింది. U/A సర్టిఫికెట్ జారీ కావడం ద్వారా ఈచిత్రాన్ని కుటుంబ సమేతంగా చూడొచ్చని స్పష్టమవుతోంది.
ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. క్రితి సానన్ హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. చిత్రం ద్వారా మహేష్ బాబు తనయుడు గౌతం బాలనటుడిగా వెండితెరకు పరిచయం అవుతుండటం విశేషం. ఈచిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో తెరకెక్కించింది.


Click it and Unblock the Notifications












