పొరపాటా... మహా మార్పుకి సంకేతమా? రజినీ రాజకీయ ప్రవేశం పై ముసురుతున్న ప్రశ్నలు

వారం రోజుల క్రితం సినీ నటి నగ్మా రజనీకాంత్ తో సమావేశమయ్యారు.ఈ సమావేశంలో రాజకీయాలపై సీరియస్ గా చర్చించారని సమాచారం. రాజకీయరంగ ప్రవేశంపై ఆయన నుండి స్పష్టమైన హామీ రాలేదు.

ర‌జ‌నీకాంత్ రాజ‌కీయ రంగ ప్ర‌వేశం త‌మిళ నాట ఎప్పుడూ ఆస‌క్తిక‌ర‌మైన టాపిక్కే. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారా? అనే అంశం హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సినీ నటి నగ్మా ఇటీవల రజనీకాంత్ తో సుదీర్ఘంగా సమావేశం కావడం , ఈ నెల 15 నుండి 19వ, తేదివరకు అభిమానులతో రజనీకాంత్ సమావేశాలు ఏర్పాటు చేయడంతో ఈ చర్చ మరోసారి తెరమీదికి వచ్చింది.

సినీ నటి నగ్మా

సినీ నటి నగ్మా

వారం రోజుల క్రితం సినీ నటి నగ్మా రజనీకాంత్ తో సమావేశమయ్యారు.ఈ సమావేశంలో రాజకీయాలపై సీరియస్ గా చర్చించారని సమాచారం. అయితే రాజకీయరంగ ప్రవేశంపై ఆయన నుండి స్పష్టమైన హామీ రాలేదు.అయితే నగ్మాతో సమావేశం జరిగిన వెంటనే అభిమానసంఘాలతో రజనీకాంత్ సమావేశం కావడం రాజకీయంగా ప్రాధాన్యత ఏర్పడింది.

ఎనిమిదేళ్ల తర్వాత

ఎనిమిదేళ్ల తర్వాత

ఎనిమిదేళ్ల తర్వాత సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ఫ్యాన్స్‌ను కలవనున్నారు. ఇందుకు చెన్నైలోని రాఘవేంద్ర కళ్యాణమండపం వేదిక కానుంది. ఈ నెల 15వ తేదీ నుంచి 19వ తేదీ వరకూ నాలుగు రోజుల పాటు రజనీకాంత్‌ ఫ్యాన్స్‌ను కలుస్తారు.చివరగా 2007లో శివాజీ సినిమా విడుదల తర్వాత రజనీ అభిమానులను కలుసుకున్నారు. ఈ మీట్‌లో విడిగా ఒక్కొక్కరితో రజనీ సెల్ఫీ దిగుతారు.

పాలిటిక్స్‌లోకి వ‌స్తాను

పాలిటిక్స్‌లోకి వ‌స్తాను

పాలిటిక్స్‌లోకి వ‌స్తాను - రాను` ఏదీ తేల్చకుండా సంవ‌త్స‌రాల త‌ర‌బ‌డీ ఊరిస్తున్నాడు ర‌జ‌నీకాంత్‌. ఈ సూప‌ర్ స్టార్ పొలిటిక‌ల్ ఎంట్రీకి త‌మిళ నాట ప్ర‌స్తుతం అనుకూల వాతావ‌ర‌ణం ఏర్ప‌డిన‌ట్టు అక్క‌డి రాజ‌కీయ శ్రేణులు విశ్లేషిస్తున్న నేప‌థ్యంలో... ర‌జ‌నీకాంత్ ఇప్పుడో ముందడుగు వేస్తున్నాడు. ఈనెల 15 నుంచి 19 వరకు అభిమానులతో సమావేశం కానున్నారు.

రజనీ పొలిటికల్ ఎంట్రీ

రజనీ పొలిటికల్ ఎంట్రీ

అభిమానులతో ఆయన గ్రూపులు, గ్రూపులుగా, విడివిడిగా కలవనున్నారు. సుమారు 8 ఏళ్ల తర్వాత రజనీకాంత్ అభిమానులతో సమావేశం అవుతున్నారు. ఆ తర్వాత ఏం జరగనుంది. రజనీ పొలిటికల్ ఎంట్రీపై గత కొద్ది రోజులుగా ఊహాగానాలు ఊగిసలాడుతున్నాయి. ఇంతకీ ఆయన రాజకీయరంగ ప్రవేశం చేస్తారా? రాజకీయంలోకి దిగేందుకు అభిమానుల అభిప్రాయాలు తీసుకుంటున్నారా? చెన్నైలో ఏం జరుగుతోంది.

జయ మరణం తర్వాత

జయ మరణం తర్వాత


తలైవా రాజకీయాల్లోకి రావాలని ఎప్పటినుంచో అభిమానులు కోరుతున్నారు. అయితే అభిమానుల కోరికను రజనీ చాలా కాలంగా సున్నితంగా తిరస్కరిస్తూ వస్తున్నారు. అన్నాడీఎంకే అధినేత్రి జయ మరణం తర్వాత తమిళనాట రాజకీయ శూన్యం ఏర్పడింది. రాష్ట్రానికి సరైన దిశ నిర్దేశం చేసే రాజకీయ నాయకత్వం కరువైంది. ఈ నేపథ్యంలో మరోసారి చూపు తలైవాపై పడింది.

భారీ ఎత్తున స‌న్నాహాలు

భారీ ఎత్తున స‌న్నాహాలు

త‌న కొత్త సినిమా విడుద‌ల‌కు ముందు ర‌జ‌నీకి ఇలాంటి మీటింగులు పెట్ట‌డం అల‌వాటే. కాక‌పోతే ఈసారి మాత్రం 2001 కి ముందు నిర్వహిమంచినంత గ్రాండ్ గా అభిమానులని రమ్మంటూ ఆహ్వానించి మరీ భారీ ఎత్తున స‌న్నాహాలు చేయ‌డం, మీటింగ్ పేరుతో అభిమానుల‌కు 5 రోజులు కేటాయించ‌డం ఈ ఊహాగానాల్ని బ‌ల‌ప‌రుస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌నుకొంటే.. ఓ పార్టీ ప్ర‌క‌టించ‌డం, లేదంటే ఓ పార్టీకి మ‌ద్ద‌తు తెల‌ప‌డానికి ఇదే స‌రైన స‌మ‌యం. అందుకే ర‌జ‌నీ తొంద‌ర‌ప‌డుతున్నాడునుకోవొచ్చు.

ఇంకా స్పష్టత రాలేదు

ఇంకా స్పష్టత రాలేదు

అయితే ఈ విషయమై ఇంకా స్పష్టత రాలేదు.ఇదే విషయమై తమిళనాడు రాష్ట్రంలో పలు ఊహగానాలు వస్తున్నాయి.ఈ ఊహగానాల నేపథ్యంలోనే అభిమానులతో ఆయన సమావేశం కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొంది. అన్నాడిఎంకె అధినేత్రీ జయలలిత మరణంతో రజనీకాంత్ రాజకీయరంగప్రవేశంపై జోరుగా చర్చసాగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X