Jailer ShowCase Review: 'జైలర్'ను రిలీజ్ చేసిన చైతు... రజనీ స్టైల్, స్వాగ్ అదిరిందంతే!

సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం జైలర్. ఇక ఈ సినిమాను తమిళ దర్శకుడు నెల్సన్ దిలీప్ కూమార్ తెరకెక్కించాడు. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని స‌న్ పిక్చ‌ర్స్ నిర్మిస్తోంది. ఇక ఈసినిమా ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండంతో.. చిత్రబృందం ట్రైలర్ ను రిలీజ్ చేసింది. ఇక ఆ వివరాల్లోకి వెళితే...

రజినీకాంత్ సినిమా అంటే... ఏ రేంజులో ఎదురుచూస్తారో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరంలేదు. ఆయనకు ఏడు పదుల వయసు వస్తున్నా.. ఆయనలో స్టైల్, స్వాగ్ ఏ మాత్రం తగ్గడం లేదు. ఇక నేటి కుర్ర హీరోలకు గట్టి పోటీనిస్తూ.. సినిమాలు తీస్తున్నారు తలైవా రజినీ. ఇక ఆయన తాజాగా నటించిన చిత్రం జైలర్. బీస్ట్ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.

Superstar Rajinikanth Jailer Movie Official ShowCase Trailer Released

రజినీ నటించిన జైలర్ మూవీ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపుదిద్దుకుంటుంది. ఈ చిత్రాన్ని స‌న్ పిక్చ‌ర్స్ నిర్మిస్తోంది. త‌మ‌న్నా హీరోయిన్‌ గా నటిస్తున్న ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ , మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్‌ మోహన్ లాల్, నాగబాబు, సునీల్, జాకీ ష్రాఫ్, రమ్య కృష్ణ లు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ సినిమా ఆగ‌స్టు 10న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్ర బృందం ప్రమోషన్స్ వేగవంతం చేసింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయినా సాంగ్స్ విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాకు అనిరుధ్ మరోసారి చాట్ బస్టర్ మ్యూజిక్ అందించారు. ముఖ్యంగా కావాలయ్యా.. నువ్వు రావాలయ్యా సాంగ్ సోషల్ మీడియాలో ఓ ఊపు ఊపేస్తోంది. ఎక్కడా చూసిన ఈ సాంగే వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే... తాజాగా ఈ సినిమా థియేట్రికల్ తెలుగు ట్రైలర్ ని యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య లాంచ్ చేశారు. రజనీకాంత్ పవర్ ఫుల్ ప్రెజెన్స్, పెర్ఫార్మెన్స్, స్వాగ్, డైలాగ్ డెలివరీ, పవర్ ప్యాక్డ్ యాక్షన్ సీక్వెన్స్ తో ట్రైలర్ అద్భుతంగా ఉందని చెప్పవచ్చు. రజనీ తనదైన మార్క్ తో ఈ సినిమాలో కట్టిపడేశారు. ఆసక్తికరమైన కథాంశంతో, ఆకట్టుకునే విజువల్స్ తో ప్రేక్షకులకు సీట్ ఎడ్జ్ థ్రిల్ ని అందిస్తూ మెస్మరైజ్ చేసి క్యురియాసిటీని పెంచిసేంది.

దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ రజనీ రోల్ ను.. చాలా యూనిక్ అండ్ పవర్ ఫుల్ గా డిజైన్ చేశారు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలు వండర్ ఫుల్ గా ఉన్నాయని చెప్పవచ్చు. అలాగే నెల్సన్ మార్క్ వినోదం కూడా ఇందులో కనిపిస్తోంది. ట్రైలర్ లో జాకీష్రాఫ్ సునీల్, రమ్యకృష్ణ ల ప్రజన్స్ కూడా ఆకట్టుకుంది. అనిరుధ్ బ్రిలియంట్ బ్యాగ్ గ్రౌండ్ స్కోర్ యాక్షన్ ని మరింతగా ఎలివేట్ చేసింది.

ఇక ట్రైలర్ చివర్లో 'హుకుం.. టైగర్ కా హుకం' అని రజనీ చెప్పిన డైలాగు అభిమానులను ఉర్రూతలూగించి.. .ఈ సినిమాపై అంచనాలని మరింతగా పెంచేసింది. జైలర్ మూవీ ఆగస్ట్ 10వ తేదీన థియేటర్లలోకి రానుంది. ఏషియన్ మల్టీప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ సినిమా తెలుగు వెర్షన్‌ను విడుదల చేస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X