దుమ్మురేపుతున్న కాలా పోస్టర్.. రజనీకాంత్ 161వ సినిమా ఫస్ట్‌లుక్ రిలీజ్..

By Rajababu

గ్యాంగ్‌స్టర్ సినిమా అంటే ఇలా ఉండాలని నిరూపించింది బాషా చిత్రం. సురేశ్ కృష్ణ, రజనీకాంత్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం ఇప్పటికీ ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతికి లోనుచేస్తుంది. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ రజనీకాంత్ గ్యాంగ్‌స్టర్ సినిమాకు పచ్చజెండా ఊపారు. కబాలీ దర్శకుడు పా రంజిత్ దర్శకత్వంలో రజనీకాంత్ చేయనున్న చిత్రానికి కాలా అని పేరు పెట్టారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ గురువారం రిలీజ్ చేశారు. ఈ లుక్‌కు సోషల్ మీడియాలో విశేష స్పందన లభిస్తున్నది.

అండర్ వరల్డ్ నేపథ్యంగా..

అండర్ వరల్డ్ నేపథ్యంగా..

రజనీకాంత్ మాఫియా డాన్‌గా నటిస్తున్న చిత్రం షూటింగ్ మే 28 తేదీ నుంచి ప్రారంభం కానున్నట్టు తెలుస్తున్నది. ఈ చిత్రం ముంబై అండర్ వరల్డ్ నేపథ్యంగా తెరకెక్కతున్నది. రాజకీయాల్లో ప్రవేశించడానికి ముందే ఈ సినిమాను పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఉన్నట్టు తెలుస్తున్నది.

161వ సినిమా మళ్లీ గ్యాంగ్‌స్టర్‌గా

161వ సినిమా మళ్లీ గ్యాంగ్‌స్టర్‌గా

కాలా చిత్రం రజనీకాంత్ కెరీర్‌లో 161వ సినిమా. తలైవర్ రజనీకాంత్ నటించే చిత్రం మిర్జా హాజీ మస్తాన్ జీవిత కథ అనే వార్త వినిపిస్తున్నది. మస్తాన్ హైదర్ మీర్జా అలియాస్ హాజీ మస్తాన్ తమిళనాడుకు చెందిన ముస్లిం మతస్తుడు. తమిళ, హిందీ భాషలను అనర్గళంగా మాట్లాడే సామర్థ్యం హాజీ మస్తాన్‌కు ఉంది.

హాజీ మస్తాన్ కథ ఇదే..

హాజీ మస్తాన్ కథ ఇదే..

హాజీమస్తాన్ ముంబైలో పేరుమోసిన గ్యాంగ్‌స్టర్. స్మగ్లింగ్, సినిమాలకు ఫైనాన్స్, రియల్ ఎస్టేట్, హవాలా కార్యక్రమాలతో ముంబై మాఫియా సామ్రాజ్యాన్ని 1926 రెంయి 1994 వరకు ఏలిన చరిత్ర ఉంది. ఆ తర్వాత ఏర్పడిన అంతర్జాతీయ మాఫియా సంబంధాలతో హాజీ మస్తాన్ ఇంటర్నేషనల్ గ్యాంగ్‌స్టర్‌గా ఎదిగాడు.

పేదరికం నుంచి విలాసవంతమైన జీవితం వైపు

పేదరికం నుంచి విలాసవంతమైన జీవితం వైపు

కడు పేదరికంలో పుట్టిన హాజీ మస్తాన్ విలాసవంతమైన జీవితాన్ని గడుపాలనే కోరిక చిన్నతనం నుంచే ఉందని చెప్తుంటారు. పేదరికం కారణంగా ఎదురైన ఆటుపోట్లతో ఎలాంటి పరిస్థితులైన ఎదురించే స్థాయికి వెళ్లాడనే పోలీసులు వెల్లడిస్తుంటారు. హాజీ మస్తాన్ బలమైన మాఫియా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయడం వెనుక తమిళుడైన వరదరాజన్ ముదలియార్ హస్తం, మద్దతు ఉందని పేర్కొంటారు.

రజనీకాంత్ తప్పా మరెవరూ..

రజనీకాంత్ తప్పా మరెవరూ..

భాషా లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత ఇలాంటి ప్రభావవంతమైన కోణాలు ఉన్న మాఫియా గ్యాంగ్ లీడర్ పాత్రను సూపర్‌స్టార్ రజినీకాంత్ తప్పా మరెవరూ పోషించలేదనే భావన ఏర్పడింది. హాజీ మస్తాన్ ఆహార్యం రజనీ పక్కాగా సూట్ అవుతాయనే సినీ వర్గాల అభిప్రాయం. హాజీమస్తాన్ తెల్లటి లాల్చీ, షూస్ ధరించి మెర్సిడెజ్ బెంజ్ కారులో ప్రయాణించడం, ఖరీదైన సిగరెట్లు తాగడం లాంటి అంశాలతో కూడిన పాత్రను పోషించడం రజనీకాంత్‌కే సాధ్యమనే అభిప్రాయం బలంగా వినిపిస్తున్నది.

భాషా సంచలనం రిపీట్

భాషా సంచలనం రిపీట్

గతంలో ముంబై మాఫియాను గడగడలాడించిన గ్యాంగ్‌స్టర్ కథ ఆధారంగా వచ్చిన భాషా చిత్రం సంచలన విజయం సాధించింది. బాషాకు కొనసాగింపుగా, ఆ చిత్రాన్ని పోలిన విధంగా ఉన్న హాజీమస్తాన్ కూడా ప్రజాదరణ పొందుతుందడం ఖాయం. బాషా సంచలనం మళ్లీ రిపీట్ కావడం తథ్యం అనే వాదన వినిపిస్తున్నది.

కాగా

కాగా

హాజీమస్తాన్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతున్నదనే వార్తల నేపథ్యంలో హాజీమస్తాన్ పెంపుడు కొడుకు ఇటీవల చిత్ర యూనిట్‌కు, రజనీకాంత్‌కు నోటీసులు పంపారు. మా నాన్న ప్రతిష్ఠకు భంగం కలిగే విధంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని హాజీమస్తాన్ కుమారుడు హెచ్చరించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X