CBN Arrest: నారా లోకేశ్‌కు రజినీకాంత్ ఫోన్.. రాజమండ్రి జైలుకు పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్ మెంట్ వ్యవహారంలో అరెస్టు అయిన సంగతి తెలిసిందే. ఇక ఆయనకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించగా... చంద్రబాబు నాయుడిని రాజమండ్రి జైలుకు తరలించారు. ఇక బాబు అరెస్టుపై ఇప్పటికే ప్రముఖులు స్పందించారు. తాజాగా నారా లోకేశ్ కు సూపర్ స్టార్ రజినీ కాంత్ ఫోన్ చేశారు. మరోవైపు పవన్ కల్యాణ్ రేపు రాజమండ్రి జైలుకు వెళ్లనున్నారు. ఆ వివరాల్లోకి వెళితే....
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుపై ఇప్పటికే రాజకీయ, సినీ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది అక్రమ అరెస్టు, అప్రజాస్వామిక అరెస్టు అంటూ ఆరోపణలు చేస్తున్నారు. 2021లో స్కిల్ డెవల్మెంట్ వ్యవహారంలో చంద్రబాబు నాయుడు అవినీతి చేశారంటూ... ఆయనపై ఏపీ ప్రభుత్వం ఆరోపిస్తూ.. అరెస్టు చేసిింది. ఇక ఇప్పటికే ఆయనకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆయన్ని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.

ఇక చంద్రబాబు అరెస్టుపై పవన్ కల్యాణ్ ఇప్పటికే గళమెత్తారు. ఆయన అరెస్టు అన్యాయం అంటూ గొంతెత్తారు. ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపించారు. ఇప్పటికే ఏపీ వ్యాప్తంగా రెండు రోజులుగా చంద్రబాబు అరెస్ట్ పై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ నేతలతో పాటు.. చంద్రబాబును సినీ ప్రముఖులు, రాజకీయప్రముఖులు సపోర్ట్ చేస్తున్నారు.

ఈరోజు చంద్రబాబు అరెస్ట్ పై ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ సైతం స్పందించి ఓ వీడియో రిలీజ్ చేశారు. ఇక తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ సైతం చంద్రబాబుకు మద్దతు తెలిపారు. నారా లోకేశ్ కు రజినీకాంత్ ఫోన్ చేసి మాట్లాడినట్లు తెలుస్తోంది. నారా లోకేశ్ తో రజినీ కాంత్... " నా మిత్రుడు చంద్రబాబు గొప్ప పోరాట యోధుడు. ఆయన చేసిన అభివృద్ధి, సంక్షేమమే ఆయనకు రక్ష.. మీరేమి భయపడకండి.. కచ్చితంగా చంద్రబాబు బయటికి వస్తారు. కుటుంబం జాగ్రత్త.. అంటూ లోకేశ్ కు రజినీ ధైర్యం చెప్పినట్లు సమాచారం.
మరోవైపు చంద్రబాబును కలవడానికి పవన్ కల్యాణ్ రేపు రాజమండ్రి జైలుకు వెళ్లనున్నారు. రాజమండ్రి జైల్లో స్నేహ బ్లాక్ లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన అధ్యక్షుడు పవన్ ములాఖాత్ కానున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబుకు మద్దతు తెలిపి.. పవన్ కల్యాణ్ దైర్యం చెప్పనున్నట్లు సమాచారం. ప్రత్యేక విమానంలో పవన్ రాజమండ్రికి వెళ్లనున్నారు. ఇక జైలు అధికారులు ఇచ్చే సమయంలోనే జైల్లో ములాఖాత్ నిర్వహించనున్నారు. చంద్రబాబుగారు కుటుంబ సభ్యులను కూడా పవన్ కలిసే అవకాశాలు ఉన్నాయి.

ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా చంద్రబాబు అరెస్టు సంచలనం సృష్టిస్తోంది. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ మౌనంపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన చంద్రబాబు అరెస్టుపై ఖండించాలని టీడీపీ ఫ్యాన్స్ కోరుతున్నారు. ఇక ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ సైతం ఇండస్ట్రీ పెద్దలు స్పందించాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది అక్రమ అరెస్టు అంటూ వ్యాఖ్యానించారు.


Click it and Unblock the Notifications











