రహస్య ప్రదేశంలో సూపర్ స్టార్ రజనీకాంత్, అభిమానులపై లాఠీ చార్జ్!
Recommended Video

సూపర్ స్టార్ రజనీకాంత్ నేడు 67వ వసంతంలోకి అడుగు పెడుతున్నాడు. అయితే పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండాలని డిసైడ్ అయిన సూపర్ స్టార్ రహస్య ప్రదేశంలోకి వెళ్లిపోయినట్లు సమాచారం. తమ అభిమాన హీరోను కలిసేందుకు ఆయన నివాసానికి వస్తున్న పలువురు అభిమానులు నిరాశ చెందారు.

అందుకే వేడుకలకు దూరంగా...
ఇటీవల తమిళనాడులో ఓఖి తుఫాను కారణంగా దాదాపు 500 మంది తమిళ జాలర్లు గల్లంతయ్యారు. 40 మంది వరకు మృత్యువాత పడ్డారు. ఇలాంటి తరుణంలో పుట్టినరోజు సంబరాలు జరుపుకోవడానికి రజనీ ఇష్టపడటం లేదని, అందుకే రహస్య ప్రదేశంలోకి వెళ్లిపోయారని సన్నిహితులు అంటున్నారు.

మారు వేషంలో బెంగుళూరుకు?
తమిళ సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం రజనీకాంత్ మారువేషంలో బెంగుళూరుకు వెళ్లినట్లు సమాచారం. అక్కడే ఓ రహస్య ప్రదేశంలో ఆయన కొన్ని రోజుల పాటు ఉంటారని తెలుస్తోంది.

భారీగా తరలి వచ్చిన అభిమానులతో ప్రజల ఇబ్బందులు
రజనీకాంత్‌ను కలిసి ఆయనకు విషెస్ చెప్పేందుకు భారీగా అభిమానులు ఆయన ఇంటికి చేరుకున్నారు. దీంతో పాటు ఆయనకు చెందిన చెన్నై కొడంబ్బాక్కంలోని రాఘేవంద్ర కళ్యాణమండపం వద్ద గుమిగూడారు. వేల సంఖ్యలో అభిమానులు అక్కడ గుమి కూడటంతో భారీగా ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడ్డాయి.

అభిమానుల మీద లాఠీ చార్జ్
రజనీకాంత్ అభిమానుల వల్ల సాధారణ ప్రజలు ఇబ్బంది పడుతుండటంతో పోలీసలు వారిని అక్కడి నుండి పంపించే ప్రయత్నం చేశారు. కొన్ని చోట్ల అత్యుత్సాహం ప్రదర్శించిన రజనీకాంత్ అభిమానులపై పోలీసులు లాఠీ చార్జ్ చేసినట్లు సమాచారం.
అమితాబ్ బచ్చన్ విషెస్
నా ప్రియమైన స్నేహితుడు అంటూ...రజనీకాంత్‌కు అమితాబ్ బచ్చన్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. రజనీకాంత్ ఎంతో అనకువగల వ్యక్తి అని, చాలా మంచి హృదయం ఉన్న వ్యక్తి అని ఈ సందర్భంగా అమితాబ్ వ్యాఖ్యానించారు.
అక్షయ్ కుమార్ ట్వీట్
మిమ్మల్ని ఆన్ స్క్రీన్ మీద చూసినప్పుడల్లా ఆశ్చర్యపోతుంటాను. మీతో కలిసి పని చేసిన తర్వాత వ్యక్తిగతంగా కూడా మీకు ఫ్యాన్ అయిపోయాను. రజనీసార్ హ్యాపీ బర్త్ డే.... అంటూ అక్షయ్ కుమార్ ట్వీట్ చేశారు.
కరణ్ జోహార్ ట్వీట్
సూపర్ స్టార్ రజనీకాంత్‌కు పుట్టినరోజు విషెస్ తెలుపుతూ ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ ట్వీట్ చేశారు.
హీరోయిన్ కాజల్ ట్వీట్
సూపర్ రజనీకాంత్‌కు ఎంతో మందికి ఆదర్శం అని, ఆయన ఎప్పుడూ సంతోషంగా ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ హీరోయిన్ కాజల్ ట్వీట్ చేశారు.


Click it and Unblock the Notifications