twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రీమియర్ షో టాక్: 'కాలా' కొట్టాడు బాక్సాఫీస్ పగిలేలా.. ఫ్లైఓవర్ ఫైట్‌లో రజనీ, ఫ్యాన్స్‌కు పూనకాలే!

    |

    Recommended Video

    Superstar Rajiniknath's Kaala Movie Premier Show Talk

    సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కాలా చిత్రం నేడు ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలవుతోంది. రజని సినిమా అంటే అంచనాలు ఏస్థాయిలో ఉంటాయో అందరికి తెలిసిందే. తమిళనాడు సహా ఇండియాలోని రజని ఫ్యాన్స్ అంతా కాలా ఫీవర్ తో ఊగిపోతున్నారు. కబాలి ఫేమ్ పా రంజిత్ దర్శకత్వంలోని రజనీ నటించిన మరో చిత్రం ఇది. రజని అల్లుడు ధనుష్ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. రజనీకాంత్ సరసన ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ హ్యూమా క్యురేషి, సీనియర్ హీరోయిన్ ఈశ్వరి నటించడం విశేషం. యుఎస్, ఇండియాలోని చాలా ప్రాంతాల్లో కాలా ప్రీమియర్ షోల ప్రదర్శన పూర్తయింది. అభిమానుల స్పందన, చిత్ర విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం!

    పేద ప్రజల నాయకుడు

    పేద ప్రజల నాయకుడు

    దర్శకుడు రంజిత్ ఎలాంటి ప్రయోగాలకు పోకుండా సూపర్ స్టార్ రజినీకాంత్ కు సూటయ్యే కథతోనే వచ్చాడు. ముంబై లోని ధారవి స్లమ్ ఏరియాలో పేద ప్రజల నాయకుడిగా రజినీకాంత్ ఈ చిత్రంలో కనిపిస్తున్నాడు.

    మ.. మ.. మాస్

    మ.. మ.. మాస్

    రజనీకాంత్ మాస్ లుక్ ఈ చిత్రంలో ఆకట్టుకుంటోంది. దర్శకుడు పా రంజిత్ రజనీకాంత్ ఫ్యాన్స్ కు అవసరమైన మాస్ మసాలా అంశాలు అన్ని ఈ చిత్రంలో దట్టించాడు. వాటిని అద్భుతంగా వెండి తెరపై ప్రజెంట్ చేయడంతో విజయం సాధించాడు అని చెప్పొచ్చు.

     ఫస్ట్ హాఫ్ హైలైట్స్

    ఫస్ట్ హాఫ్ హైలైట్స్

    రజనీకాంత్ ఇంట్రడక్షన్ సన్నివేశం చాలా బావుంది. ముంబైలోని స్లమ్ ప్రజల కష్టాలని దర్శకుడు నేచురల్ గా చూపించాడు.

    ప్లైఓవర్ ఫైట్ పూనకాలే

    ప్లైఓవర్ ఫైట్ పూనకాలే

    ఇంటర్వెల్ ముందు వచ్చే ఫ్లైఓవర్ ఫైట్ సీన్ కాలా చిత్రానికే హైలైట్ అని చెప్పొచ్చు. మాస్ ప్రియులని, రజని అభిమానులని ఈ ఫైట్ విపరీతంగా అలరిస్తుంది. వర్షంలో సాగె ఈ ఫైట్ చూసి ఫాన్స్ సంతోషంలో మునిగితేలుతున్నారు.

    సెకండ్ హాఫ్

    సెకండ్ హాఫ్

    సెకండ్ హాఫ్ లో కథ నెమ్మదిగా సాగినప్పటికీ దర్శకుడు తాను చెప్పాలనుకున్న పాయింట్ లో బలాన్ని మాత్రం కోల్పోలేదు.

    బ్యాక్ గ్రౌండ్ సంగీతం అదుర్స్

    బ్యాక్ గ్రౌండ్ సంగీతం అదుర్స్

    రజనీకాంత్ ఎలివేషన్ సన్నివేశాల్లో బ్యాగ్రౌండ్ సంగీతం అదిరిపోయింది. ముఖ్యంగా పోలీస్ స్టేషన్ సీన్, యాక్షన్ సన్నివేశాల్లో సంతోష్ నారాయణ్ అందించిన బ్యాగ్రౌండ్ సంగీతం సినిమా స్థాయిని పెంచిందని చెప్పొచ్చు.

    సినిమాకు మరింత బలం

    సినిమాకు మరింత బలం

    దర్శకుడు పా రంజిత్ అనుకున్న సన్నివేశాలు అనుకున్నట్లు వెండితెరపై పడడానికి సాంకేతిక విభాగం పనితనం కూడా ఉంది. ముఖ్యంగా సినిమాట్రోగ్రఫీ టాప్ క్లాస్ గా ఉంది. రంజిత్ కథని బలంగా చూపించగలిగాడు.

    మాస్ మసాలా ఫిల్మ్

    మాస్ మసాలా ఫిల్మ్

    పేద ప్రజల నాయకుడిగా రజని ఈ చిత్రంలో కనిపించినప్పటికీ ఆయన ఆ చిత్రాల నుంచి ఫ్యాన్స్ ఆశించే మాస్ అంశాలు ఎక్కడా మిస్ కాకుండా జాగ్రత్త పడ్డాడు. ప్లైఓవర్ ఫైట్ సీన్, పోలీస్ స్టేషన్ సన్నివేశం, రజని తన స్టైల్ లో డెలివర్ చేసిన డైలాగులు ఈ చిత్రానికి ప్రధాన బలం అని చెప్పొచ్చు. రాజకీయంగా కూడా రజనికి ఈ చిత్రం ఉపయోగపడే అవకాశం ఉంది.

    ఆ కొన్ని అంశాలు

    ఆ కొన్ని అంశాలు

    రొటీన్ కథ, స్లో స్క్రీన్ ప్లే, పాటలు ఈ చిత్రంలో బలహీనతలుగా చెప్పుకోవచ్చు. ఈ బలహీనతలు కాలా విజయానికి అడ్డు కాకపోవచ్చు. ఇప్పటికే మొదలైన పాజిటివ్ టాక్ తో రజని ఈసారి బాక్స్ ఆఫీస్ ని బలంగా కొట్టే అవకాశాలు ఉన్నాయి.

    English summary
    SuperStar Rajiniknath's Kaala movie premier show talk. Rajinikanth back with mass elements
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X