సాధువులతో సూపర్ స్టార్..ఫోటోలు వైరల్!
సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం హిమాలయాల పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. హిమాలయాలలో గల పలు పుణ్య క్షేత్రాలని రజినీకాంత్ సందర్శిస్తున్నారు. గత కొన్నేళ్లుగా రజినీకాంత్ హిమాలయాల పర్యటనకు వెళుతున్న సంగతి తెలిసిందే. గతంలో లాగా కాకుండా రజనీకాంత్ హిమాలయ పర్యటన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.రజనీకాంత్ రాజకీయరంగ ప్రవేశం చేసిన తరువాత ఆయనకు మీడియా తాకిడి పెరిగింది.
Recommended Video

హిమాలయాల్లో రజని ఏం చేస్తారు? షాకిస్తున్న ఫోటోలు!
కాగా నేడు రజినీకాంత్ రిషికేష్ ఆలయాన్ని సందర్శించారు. అక్కడ రజని సాధువులతో ఉన్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అభిమానులంతా రజనీకాంత్ రాజకీయ పార్టీ కోసం ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా రజని నటించిన కాలా చిత్రం ఏప్రిల్ 27 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.



Click it and Unblock the Notifications











