For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  తెలుగు మాస్ హీరోలు... అదిరిపోయే బైకులు(ఫోటో ఫీచర్)

  By Srikanya
  |

  హైదరాబాద్: వైవిధ్యమే తెలుగు మాస్ హీరోల మంత్రం. ఈ యాంగిల్ లో వారు ప్రతీ సినిమాకు క్రాప్ దగ్గరనుంచి, కాస్ట్యూమ్స్ దాకా మారుస్తూంటారు. అలాగే వారి చేతిలో ఉండే ట్రెండీ బైకులు కూడా వీరి ఇమేజ్ కి కొత్త రూపు తెచ్చి పెట్టి జైజేలు కొట్టించుకుంటున్నాయి. దాదాపు 1970 నుంచి అంటే తెలుగు సినిమా కమర్షియల్ సినిమా గా పూర్తిగా మారుతున్న దశనుంచి హీరో చేతిలో ఓ బైక్ ఉండటం కామన్ అయిపోయింది. ఈ నేపధ్యంలో మన తెలుగు హీరోలు వివిధ సినిమాల్లో వాడిన బైక్ లు గురించి బ్రేక్ లు లేకుండా చర్చిస్తే...

  1987లో వచ్చిన మెగాస్టార్ చిత్రం అత్తకు మొగుడు అమ్మాయికి మొగుడులో... చిరు రాయల్ ఎన్ ఫీల్డ్ తో కనిపించి మాస్ చేత విజిల్స్ వేయించాడు. ఆ రోజుల్లో సినిమా సినిమాకీ చిరు చేతిలో బైక్ మారిపోయేదంటే అతిశయోక్తి కాదు. చిరు ఏ బైక్ వాడారో ఆ బైక్ కి మార్కెట్లో డిమాండ్ బాగా పెరిగేదని అంటారు.

  నాగార్జున ఎప్పుడూ తన ఇంటర్వూలో తనకు కొత్త కార్లు అన్నా, బైక్స్ అన్నా చాలా ఇష్టం అని చెప్తూంటారు. ఆయన అనుష్క కాంబినేషన్ లో చేసిన సూపర్ చిత్రంలో బైక్ తో కనపడి తన ఫ్యాన్స్ కి పండుగ చేసుకునే లా చేసారు.

  వెంకటేష్ లేటెస్ట్ చిత్రం షాడో లో ఈ ఏజ్ లోనూ తనకు తిరుగు లేదనట్లుగా బైక్ మీద ఎలా చక్కర్లు కొడుతున్నారో చూడండి.

  బాలకృష్ణ చాలా సినిమాల్లో బైక్స్ మీద హీరోయిన్స్ చుట్టూ తిరుగుతూ, విలన్స్ కి వార్నింగ్ లు ఇస్తూ చక్కర్లు కొట్టారు. 2008లో వచ్చిన ఒక్క మగాడులో ఆయన బైక్ రైడ్ చూసిన వారు ఒక్క మగాడు ఆయనే అన్నారు.

  పవన్ కళ్యాణ్ పవర్ గురించి చెప్పేదేముంది. ఆయనకీ ట్రెడీ బైక్స్ అంటే భలే ఇష్టం. ఇప్పటికీ తనకు బైక్ మీద హైదరాబాద్ లో చక్కర్లు కొట్టాలని ఉందని చెప్తూంటారు. 2011లో వచ్చిన తీన్ మార్ లో ఆయన బైక్ పై కనపడి ఫ్యాన్స్ చేత తీన్ మార్ వేయించారని గుర్తుండే ఉంటుంది.

  టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు... ఆయనకి ఉన్న క్రేజ్ ఎంతో ఊహించటం కష్టమే. యూత్, ఫ్యామిలీ అనే తేడా లేకుండా అలరించే ఆయన అతిధి చిత్రంలో బైక్ మీద కనపడ్డారు. ఇప్పటికీ ఆ సీన్.. చూసి ఫ్యాన్స్ చాలా హ్యాపీ ఫీలవుతూంటారు.

  ఫన్ తో కుర్రకారుకి వైన్ లా కిక్ ఎక్కించే రవితేజ.. తాజాగా వచ్చిన నిప్పు చిత్రంలో బైక్ మీద కనపడ్డారు.

  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్... ఈ మాట వింటేనే అమ్మాయిల గుండెల్లో గుబులు రేగుతుంది. ఆయనకి మోటారు సైకిల్స్ అంటే భలే పిచ్చి. వేదం చిత్రంలో ఆయన ట్రెండీ లుక్ తో డిఫెరెంట్ బైక్ తో కనపించారు.

  రామ్ చరణ్ సైతం బైక్ తో రచ్చ చిత్రంలో రచ్చ రచ్చ చేసారు. ఆయన ప్రతీ సినిమాలోనూ బైక్ రైడ్ ఉంటుంది. అది చాలా కామన్.

  జూ ఎన్టీఆర్, ప్రభాస్ ఇద్దరూ.. బైక్స్ విషయంలో మొహమాటం లేదు. ఎప్పూడూ బైక్ రైడింగ్ అంటే ఉత్సాహపడే వీళ్లూ తమ సినిమాల్లో బైక్ రైడింగ్ సీన్స్ కి ప్రయారిటీ ఇచ్చి తన ఫ్యాన్స్ ని ఉత్సాహంలో ముంచుతూంటారు.

  English summary
  Filmmakers use several elements to attract young audience and they drive them crazy towards theatres. One of them is the use of trendy bikes, which have a special place in the lives of youth. This trend dates back to four decades in Telugu film industry. In 1970s, a few Tollywood directors and heroes were fascinated by this idea and tried to bring fashionable motorcycles in their movies.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more