పవన్ కళ్యాణ్ మూవీని కాపాడండి... టోల్ ఫ్రీ నెంబర్స్

By Bojja Kumar

హైదరాబాద్: మీరు తెలుగు సినిమా అభిమానులా? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వీరాభిమానులా? అయితే మీరూ పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'అత్తారింటికి దారేది' చిత్రాన్ని రక్షించడంలో భాగస్వాములు కండి. పైరసీకి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటానికి మీ వంతు సహాయం అందించండి.

'అత్తారింటికి దారేది' చిత్రం మొక్క 90 నిమిషాల నిడివిగల భాగం బయటకు లీకైంది. ఇంటర్నెట్‌తో పాటూ....సీడీల రూపంలో లీక్ చేసి నిర్మాతను నష్టాల పాలు చేసి, పవన్ కళ్యాన్ ఇమేజ్ డ్యామేజ్ చేసేందుకు కొందరు దుర్మార్గులు ఈ చర్యకు పాల్పడ్డారని స్పష్టం అవుతోంది.

మీకు పైరసీకి సంబంధించిన సమాచారం తెలిస్తే... 1800 4250 111, 94901 64545 టోల్ ఫ్రీ నెంబర్లకు ఫోన్ చేయండి లేదా [email protected] ఈ మెయిల్ చేయండి. పైరసీ భూతం నుంచి తెలుగు సినిమాను కాపాడటంలో మీరు భాగస్వాములుకండి.

'అత్తారింటికి దారేది' చిత్రాన్ని అక్టోబర్ 9 విడుదల చేస్తున్నట్లు ఇటీవల నిర్మాతలు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అనుకున్న దానికంటే రెండు వారాల ముందుగా....సెప్టెంబర్ 27నే సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సినిమా పైరసీకి గురైన నేపథ్యంలో నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X