ఎస్ఎంఎస్ కొట్టు.... రాజమౌళిని గెలిపించు!
హైదరాబాద్: దర్శకుడు రాజమౌళిని గెలిపించే అవకాశం ఆయన అభిమానులకు వచ్చింది. రాజమౌళి CNN-IBN ఇండియా-2012 అవార్డుకు నామినేట్ అయిన సంగతి. ప్రతి సంవత్సరం CNN-IBN వివిధ కేటగిరీల్లో అవార్డులు ప్రధానం చేస్తారు. ఎంటర్ టైన్మెంట్ రంగంలో సౌతిండియా నుంచి కేవలం రాజమౌళి మాత్రమే నామినేట్ అయ్యారు.
మరి రాజమౌళికి ఈ అవార్డు దక్కడం దక్కక పోవడం అంతా మన చేతుల్లోనే ఉంది. ఈ అవార్డుకు నామినేట్ అయిన వారిలో దేశ వ్యాప్తంగా ఎవరికి ఎక్కువ ఎస్ఎంఎస్ లు వస్తే వారికే అవార్డు దక్కుతుంది. మరి మన రాజమౌళికి ఈ అవార్డు దక్కాలంటే దక్షిణాది ప్రజల సపోర్ట్... ముఖ్యంగా తెలుగు సినీ అభిమానుల సపోర్టు అవసరం. అందుకు మనం చేయాల్సిందల్లా... IENT 5 అని టైట్ చేసి 51818 అనే నెంబర్ కు ఎస్ఎంఎస్ చేయడమే.
ఈ కేటగిరిలో ఇంకా అమీర్ ఖాన్ అండ్ సత్యమేవ జయతే టీం, ఇర్ఫాన్ ఖాన్, రణబీర్ కపూర్, శ్రీదేవి, విద్యా బాలన్ కూడా నామినేట్ అయ్యారు. వీరిలో ఎవరిక ఎక్కువ మంది మద్దతు లభిస్తే వారికి అవార్డు దక్కనుంది. ఈగ చిత్రానికి గాను రాజమౌలి ఈ అవార్డుకు నామినేట్ అయ్యారు.
రాజమౌళి సినిమాల విషయానికొస్తే..
ఇటీవలే 'ఈగ' చిత్రంతో హిట్ కొట్టిన రాజమౌళి... తర్వాత ప్రభాస్‌తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. భారీ బడ్జెట్, భారీ తారాగణం, భారీ హంగుళతో రూపొందుతున్న ఈచిత్రం తెలుగు సినిమా చరిత్రలో గొప్ప చిత్రంగా తీర్చిద్దేందుకు రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











