మన కాట్రాజ్(సుప్రీత్) బాలీవుడ్ ఎంట్రీ
క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు సుప్రీత్ అలియాస్ కాట్రాజ్ త్వరలో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. చత్రపతి సినిమాలో సుప్రీత్ పోషించిన కాట్రాజ్ పాత్రకు బాగా పేరు రావడంతో అంతా అతన్ని కాట్రాజ్ అని పిలుస్తున్నారు.
రాజమౌళి-రవితేజ దర్శకత్వంలో వచ్చిన 'విక్రమార్కుడు' సినిమా తాజాగా బాలీవుడ్ లో 'రౌడీ రాథోడ్' పేరుతో రీమేక్ అవుతోంది. అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్నాడు. ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సంజయ్ లీలా బన్సాలీ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోని విలన్లలో ఒకరిగా సుప్రీత్ ఎంపిక చేశారు.
జనవరి 9న 'రౌడీ రాథోడ్' చిత్ర షూటింగ్ లోకి సుప్రీత్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. విక్రమార్కుడు చిత్రంలో అజయ్ పోషించిన బంధిపోటు పాత్రను రౌడీ రాథోడ్ లో సుప్రీత్ పోషిస్తున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











