ఖుష్భు..పెళ్ళికి ముందు సెక్స్ కి సుప్రీం కోర్టు ఖండన
దాదాపు ఐదేళ్ళ క్రితం పెళ్ళికి ముందు సెక్స్ సుఖం అనుభవించడం తప్పు కాదని ఒక నాటి హీరోయిన్ ఖుష్బూ ధైర్యంగా చెప్పి వార్తల్లోకి వచ్చింది. అప్పుడు చాలా మంది ఖండించారు. మరి కొంత మంది ఇది పనికొచ్చే విషయమేనంటూ ఆమెకు సపోర్టు ఇచ్చారు. అయితే తాజాగా ఈ విషయపై సుప్రీం కోర్టు సీరియస్ అయింది. తమిళ నాడుకు చెందిన అనేక మంది ఈ వివాదంపై అప్పట్లో కోర్టుకు వెళ్లారు. కేసు పూర్వా పరాలు పరిశీలించిన జడ్జి కెజి బాలకృష్ణన్ ఖుష్బూనే తప్పుపట్టారు. అలా పబ్లిక్ ని తప్పు దారి పట్టించేలా వ్యవహిస్తూ మాట్లాడినందుకు రెండు వారాల లోపల ఎక్సప్లనేషన్ పంపమని ఆమెను ఆదేశించారు. దాంతో ఖుబ్షూ మరోసారి కోర్టు గుమ్మం ఎక్కే అవకాశం ఉంది. విషయం కోర్టు పరిధిలో ఉండటంతో దీనిపై కామెంట్ చేయటానికి ఎవరూ ఆసక్తి చూపటం లేదు. ఇక అప్పట్లో నమిత వంటి హీరోయిన్స్ ఆమెను బహిరంగంగా సమర్ధించారు. అప్పట్లో తమిళ హీరో ప్రభు తో కలసి సహజీవనం చేసిన ఖుష్భు ఆ తర్వాత దర్శకుడు, హీరో సుందర్.సి ని వివాహం చేసుకుని పిల్లా పాపలతో హ్యాపీగా ఉంది.


Click it and Unblock the Notifications











