twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇష్టం లేకపోతే సినిమా చూడద్దంటూ సుప్రీం కోర్టు

    By Srikanya
    |

    ఢిల్లీ: అమీర్‌ఖాన్‌ నటించిన ''పి.కె'' సినిమాపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. 'పి.కె' సినిమాలో నగ్నత్వం ప్రదర్శించారని అమీర్‌ఖాన్‌, దర్శకుడిపై సుప్రీంలో పిటిషన్‌ దాఖలైంది. దీనిపై స్పందించిన సర్వోన్నత న్యాయస్థానం కళలు, వినోదానికి సంబంధించిన విషయాలపై జోక్యం అవసరంలేదని పిటిషన్‌ను తోసిపుచ్చింది.

    అలాగే ఇష్టంలేకపోతే సినిమా చూడవద్దని అత్యున్నత న్యాయస్ధానం పిటీషనర్ కి సలహా ఇచ్చింది. అంతేకాకుండా ఇటువంటి విషయాలలో,మతపరమైన అంశాలు తీసుకురావద్దని కూడా సుప్రీ కోర్టు పిటీషనర్ కి సలహా ఇచ్చింది. సినిమా విడుదలపై ఆంక్షలు విధిస్తే నిర్మాత హక్కులకు భంగం కలిగించినట్లు అవుతుందని కోర్టు తెలిపింది.

    ఈ సినిమాలో అమీర్‌ ఒంటిపై నూలుపోగు లేకుండా కనిపిస్తున్నట్టు ముందే తెలిసినా, ఇప్పుడు పోస్టర్‌ విడుదల చేసి సినిమాపై అంచనాలను పెంచేశాడు అమీర్‌. ఇంతకీ ఎలా ఉన్నాడు? ఒంటిపై దుస్తులు లేకుండా రైలు పట్టాలపై అడ్డంగా నుంచుని తీక్షణంగా చూస్తున్నాడు. చేతిలో ఓ టూ ఇన్‌ వన్‌ను అడ్డం పెట్టుకున్నాడు కూడా. తన మూడు దశాబ్దాల సినీ జీవితంలో అమీర్‌ ఇలాంటి అవతారంలో కనిపించడం ఇదే తొలిసారి. ఆన్‌లైన్లో ఈ పోస్టర్‌కు మంచి స్పందన వస్తోంది.

    Supreme Court dismisses PIL seeking ban on Aamir Khan's PK

    మరో ప్రక్క ''నేనెలా ఉన్నానో తొందరగా చెప్పండి. తెగ కంగారుగా ఉంది'' అంటున్నాడు అమీర్‌ఖాన్‌. 'పీకే'లో తన కొత్త గెటప్‌ను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసి అభిమానుల అభిప్రాయాలను కోరుతున్నాడు.

    కరణ్‌ జోహార్‌ స్పందిస్తూ ''అద్భుతంగా ఉంది. సినిమాపై ఆసక్తిని పెంచుతోంది'' అని ట్వీట్‌ చేశాడు. ''పిచ్చెక్కిపోతోంది. సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాం'' అంటూ విశాల్‌ దద్లానీ వ్యాఖ్యానించాడు. ఈ స్పందనలను చూశాక అమీర్‌ మళ్లీ ట్వీట్‌ చేస్తూ, ''గ్రహాంతర వాసా? ఆది మానవుడా? తాగుబోతా? అబ్బో... ఇలా చాలా రకాలుగా ఊహిస్తున్నారు. హ..హ్హ...హా... చాలా ఆనందంగా ఉంది'' అని రాశాడు.

    ఇంతకీ ఈ పాత్ర ఏమిటనే విషయాన్ని త్వరలోనే బయటపెడతారట. ఈ ఏడాది డిసెంబర్‌19న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకి రాజ్‌కుమార్‌ హిరాని దర్శకత్వం వహిస్తున్నారు.

    'పీకే' సినిమా విషయానికొస్తే.... ఇదొక పొలిటికల్ సెటైర్ మూవీ. రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రంలో అమీర్ ఖాన్, అనుష్క శర్మ, సంజయ్ దత్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈచిత్రంలో అమీర్ ఖాన్ గగ్రా చోళీ డ్రస్ లో కనిపించనున్నాడు.

    అలాగే అమీర్ ఖాన్ బాలీవుడ్ సినిమా చరిత్రలోనే అత్యంత పొడవైన కిస్సింగ్ సీన్లో నటించి రికార్డు సృష్టించబోతున్నాడు. బాలీవుడ్ హాట్ హీరోయిన్ అనుష్క శర్మతో కలిసి అమీర్ ఖాన్ ఈ ముద్దు సీన్లో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో వీరి మధ్య జరిగే ఓ రొమాంటిక్ సన్నివేశంలో ఈ ముద్దు సీన్ ఉంటుందని తెలుస్తోంది. వయసులో తనకంటే సగం వయసు ఉన్న అనుష్క శర్మతో అమీర్ ఖాన్ ఈ లాంగెస్ట్ కిస్సింగ్ సీన్లో నటించడం చర్చనీయాంశం అయింది. బాలీవుడ్ చరిత్రలోనే అత్యంత ఎక్కువ నిడివి ఉన్న ముద్దు సీన్‌ ఇదే అని అంటున్నారు.

    English summary
    The Supreme Court today refused to entertain a public interest litigation seeking ban on the release of PK for promoting nudity and vulgarity.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X