బ్రేకింగ్: రియా చక్రవర్తికి ఎదురుదెబ్బ.. సుశాంత్ సింగ్ కేసు సిబీఐకి.. సుప్పీంకోర్టు సంచలన తీర్పు
దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసు విచారణపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకొన్నది. ఈ కేసులో ప్రియురాలు రియా చక్రవర్తి దాఖలు చేసిన పిటిషన్‌ను బుట్టదాఖలు చేసింది. ఆమె పిటిషన్‌ను తిరస్కరిస్తూ పాట్నా నుంచి ముంబైకి కేసును బదిలీ చేసే ప్రస్తకి లేదని తీర్పులో వెల్లడించింది. దీంతో రియా చక్రవర్తికి, ముంబై పోలీసులకు ఎదురుదెబ్బ తగిలింది. సుశాంత్ కేసును బీహార్ పోలీసులు విచారించాలని సుప్రీంకోర్టు తన తీర్పును వెల్లడించింది.
Recommended Video

రియా పిటిషన్‌కు తిరస్కారం
సుశాంత్ మరణం తర్వాత అనేక అనుమానాలు తలెత్తడంతో సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్ వచ్చింది. ఈ క్రమంలో సుశాంత్ కేసును సీబీఐ అప్పగించాలని రియా చక్రవర్తి డిమాండ్ చేసింది. కేంద్ర మంత్రి అమిత్ షాకు లేఖ రాస్తూ సుశాంత్ మరణం కేసులో వాస్తవాలు బయటకు రావాలంటే సీబీఐ విచారణ అవసరమని రియా పేర్కొన్నది. అలాగే పాట్నాలో దాఖలైన కేసును ముంబైకి ట్రాన్స్‌ఫర్ చేయాలని దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించింది.

మహారాష్ట్రకు మొట్టికాయ
సుశాంత్ కేసును సీబీఐ దర్యాప్తుకు ఆదేశిస్తూ సుప్రీం స్పష్టమైన ఆదేశాలిచ్చింది. ఈ కేసును దర్యాప్తు చేసే సీబీఐకి సంపూర్ణ సహకారం అందించాలని మహారాష్ట్ర సర్కారుకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రివ్యూ పిటిషన్ దాఖలు చేయడానికి అవకాశం లేదని స్పష్టం చేసింది. సీబీఐ కోరితే కేసును సీబీఐకి అప్పగించాలని బీహార్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు తన తీర్పులో సూచించారు. ఈ తీర్పును న్యాయమూర్తి హృషికేష్ రాయ్‌తో కూడిన ఏక సభ్య ధర్మాసనం వెల్లడించింది.

రియా పిటిషన్‌పై వాడివేడి వాదనలు
కొద్ది రోజుల క్రితం సుశాంత్ మరణం కేసు దర్యాప్తును సీబీఐ చేపట్టడాన్ని వ్యతిరేకిస్తూ, అలాగే పాట్నా నుంచి కేసును ట్రాన్స్‌ఫర్ చేయాలని రియా చక్రవర్తి దాఖలు చేసిన తాజా పిటిషన్‌పై వాదనలు జరిగాయి. మహారాష్ట్ర ప్రభుత్వం తరఫున డాక్టర్ అభిషేక్ మను సింఘ్వీ, బీహార్ తరుఫున మనిందర్ సింగ్, రియా తరఫున శ్యామ్ దీవాన్, సుశాంత్ సింగ్ తరుఫున వికాస్ సింగ్ కోర్టు విచారణలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా పాల్గొన్నారు.

సుశాంత్ తండ్రి ఫిర్యాదుతో మలుపు
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసుకు సంబంధించి సీబీఐకి దర్యాప్తును అప్పగించాలనే విషయంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పును బుధవారం వెల్లడించింది. సుశాంత్ మరణం, ఆయన బ్యాంకు అకౌంట్లలో అవకతవకలు జరిగాయంటూ ఆయన తండ్రి కేకే సింగ్ పాట్నాలో కేసు నమోదు చేయడం తెలిసిందే. ఆ కేసును సీబీఐకి అప్పగించాలనే డిమాండ్ పెద్ద ఎత్తున రావడం తెలిసిందే. అయితే పాట్నా నుంచి కేసును ముంబైకి బదిలీ చేయాలని, అలాగే సీబీఐ దర్యాప్తు చేపట్టవద్దని సుశాంత్ సింగ్ ప్రియురాలు రియా చక్రవర్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

అన్యాయంపై న్యాయం విజయం.. బీహార్ డీజీపీ కామెంట్
సుశాంత్ సింగ్ కేసును పూర్తిస్థాయిలో విచారించాలి. సుశాంత్ మరణానికి సంబంధించి భవిష్యత్‌లో నమోదయ్యే కేసులను కూడా సీబీఐ పరిగణనలోకి తీసుకోవాలి అని సుప్రీంకోర్టు తన తీర్పులో వెల్లడించింది. ఉన్నత కోర్టు తీర్పును బీహార్ డీజీపీ స్వాగతించారు. అన్యాయంపై న్యాయం విజయం సాధించింది అని డీజీపీ అన్నారు.


Click it and Unblock the Notifications











