twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టాప్ డైరెక్టర్‌పై రేప్ కేసు కొట్టివేత

    By Bojja Kumar
    |

    ముంబై : ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు, జాతీయ అవార్డు విన్నర్ మధుర్ బండార్కర్‌పై ఉన్న రేప్ కేసును భారత అత్యున్నత న్యాయస్థానం సోమవారం కొట్టి వేసింది. గతంలోనే ఈ కేసు విచారణ నిలిపి వేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన కోర్టు తాజాగా దాన్ని కొట్టి వేసింది.

    సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానంటూ మాయమాటలు చెప్పి తనని మధుర్ బండార్కర్ లొంగదీసుకున్నాడని, తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసాడని ప్రీతీ జైన్ అనే యువతి కోర్టుకెక్కింది. 1999-2004 మధ్య కాలంలో మధుర్ తనను లొంగదీసుకున్నాడని ఆరోపించిన ప్రీతి 2009లో అతనిపై అత్యాచారం కేసు వేసింది.

    అప్పట్నుంచి ఆయన షరతులతో కూడిన బెయిల్ పైనే వున్నారు. ఇటీవల ఆయన తనపైన జరుగుతోన్న కేసు విచారణ నిలిపివేయాలంటూ కోర్టుకి విన్నవించుకోవడంతో, పరిశీలించిన కోర్టు నిలిపి వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అతనిపై అభియోగాలకు సరైన సాక్ష్యాలు లభించక పోవడంతో తాజాగా కేసును కొట్టి వేసినట్లు తెలుస్తోంది.

    మాధుర్ బండార్కర్, తాను 16 సార్లు సెక్స్‌లో పాల్గొన్నామని, అతని సినిమాల్లో తనకు హీరోయిన్ అవకాశం ఇస్తానని మధుర్ బండార్క్ తనను శారీరకంగా వాడుకున్నాడని, పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసాడని ప్రీతి జైన్ వాదిస్తూ వచ్చింది. అయితే కోర్టు తీర్పు మధుర్ బండార్కర్‌కు అనుకూలంగా వచ్చింది.

    ఆ సంగతి పక్కన పెడితే...మధుర్ బండార్కర్ పేరు వినగానే వాస్తవ సంఘటనల ఆధారంగా ఆయన తెరకెక్కించిన సినిమాలు కళ్లముందు కదలాడతాయి. ఆయన దర్శకత్వంలో వచ్చిన ఫ్యాషన్, చాందినీ బార్, పేజ్ 3, ట్రాఫిక్ సిగ్నల్, హీరోయిన్, కార్పొరేట్ చిత్రాలే అందుకు నిదర్శనం.

    English summary
    The Supreme Court of India has dismissed rape charges against National award winning director Madhur Bhandarkar today. Bhandarkar is famous for directing films like Heroine, Chandni Bar, Page 3, Traffic Signal, Corporate and Fashion.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X