twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మాయకు సుప్రీం షాక్, ఆరక్షణ్ విడుదలకు గ్రీన్ సిగ్నల్

    By Bojja Kumar
    |

    ప్రకాష్ ఝా దర్శకత్వంలో వచ్చిన బాలీవుడ్ మూవీ 'ఆరక్షణ్"పై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విధించిన నిషేదాన్ని సుప్రీం కోర్టు ఎత్తి వేసింది. సినిమాపై నిషేదం విధించే హక్కు యూపీ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేసింది. ఆరక్షణ్ కు విడుదలకు అనుమతించాలని ఆదేశించింది. కేంద్ర సెన్సార్ బోర్డు క్లీయర్ సర్టిఫికెట్ ఇచ్చినా నిషేదం విధించడాన్ని సవాల్ చేస్తూ సినిమా దర్శక నిర్మాతలు సుప్రీం కోర్టు ఆశ్రయించిన నేపథ్యంలో...జస్టిస్ ఎం.శర్మ, జస్టిస్ అనిల్ ఆర్ దేవ్‌లతో కూడిన ధర్మాసనం పై తీర్పు ఇచ్చింది.

    కులపరమైన రిజర్వేషన్‌లను ప్రస్తావిస్తూ వచ్చిన 'ఆరక్షణ్"పై అనేక మందికి అభ్యంతరాలు ఉన్నాయని, ఆ సినిమా విడుదలైతే లా అండ్ ఆర్డర్ సమస్య ఏర్పడుతుందని ఆరోపిస్తూ మాయావతి ప్రభుత్వం ఈ సినిమాపై నిషేదం విధించిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ లోనూ ఈ సినిమాపై తొలుత నిషేదం విధించినా... దళితనేత మల్లు రవి నేతృత్వంలో వేసిన కమిటీసి సినిమాలో ఎలాంటి అభ్యంతర సన్నివేశాలు, వ్యాఖ్యలు లేవని తేల్చి చెప్పడంతో పాటు విడుదలకు సిఫారసు చేసింది. దీంతో ఏపీలో నిషేదం ఎత్తి వేశారు.

    బాలీవుడ్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, సైప్ అలీఖాన్, దీపికా పడుకొనె ప్రధాన పాత్రదారులుగా....భారతీయ విద్యా వ్యస్థలో కులపరమైన రిజరే్షన్లు ప్రధాన అంశంగా దర్శకుడు ప్రకాష్ ఝా ఈ సినిమాను రూపొదించారు. ఆగస్టు 12న ఈ సినిమా దేశ వ్యాప్తంగా విడుదలైంది.

    English summary
    The Supreme Court on Friday set aside Uttar Pradesh government's decision to suspend the screening of filmmaker Prakash Jha's " Aarakshan". The court said the UP government had no powers to suspend screening of the film on the ground that it may cause breach of peace.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X