నందమూరి బాలకృష్ణ, అనుష్క సినిమాలకు కోర్టు నోటీసులు.. ఏం జరిగిందంటే?

బాలకృష్ణ నటించిన గౌతమీపుత్ర శాతకర్ణి, అనుష్క నటించిన రుద్రమదేవి చిత్రాల నిర్మాతలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ సినిమా నిర్మాణ సంస్థలు ఒక విషయంలో సినిమా ప్రేక్షకులకు ప్రయోజనం చేకూర్చలేదని ఆరోపిస్తూ సినీ ప్రేక్షకుల సంఘం అయిన సినీ ప్రేక్షక వినియోగదారుల సంఘం MVA కోర్టును ఆశ్రయించింది. చారిత్రాత్మక నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలు కావడంతో ఈ రెండు సినిమాలకు థియేట్రికల్ గా ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ ప్రభుత్వాల నుండి పన్ను మినహాయింపు పొందాయి.

అయితే అంతగా లాభం చేకూరినప్పటికి టిక్కెట్ ధరలను తగ్గించలేదని మూవీ వ్యూయర్స్ అసోసియేషన్ కేసును విచారణకు స్వీకరించిన న్యాయస్థానం ప్రొడక్షన్ హౌస్‌లకు నోటీసులు జారీ చేసింది. గౌతమి పుత్ర శాతకర్ణి రెండు తెలుగు రాష్ట్రాల నుండి మినహాయింపు పొందగా, రుద్రమదేవికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాత్రమే వినోదపు పన్నును మాఫీ చేసింది. ఇక ఈ రెండు సినిమాలు తెలుగువారి వారసత్వంగా ప్రాముఖ్యత కలిగిన చారిత్రక చిత్రాలు కావున అప్పట్లో పన్ను మినహాయింపు ఇచ్చారు.

Supreme court notices to anushka shetty and balakrishna historical movies

ఇక ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ విజయాన్ని సాధించాయి. ఇక పన్ను మాఫీని ఎలా సమర్థిస్తారో, అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వాలు టికెట్ల రేట్ల విషయంలో కూడా నిబంధనలు తీసుకోవాల్సిందని వాదనలు వినిపించాయి. రీసెంట్ గా గౌతమి పుత్ర శతకర్ణి నిర్మాణ సంస్థ ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ కు అలాగే రుద్రమదేవి ప్రొడక్షన్ హౌస్ గుణ టీమ్ వర్క్స్ కు కోర్టు నోటీసులు పంపడం జరిగింది.

Supreme court notices to anushka shetty and balakrishna historical movies

ఇక నిర్మాణ సంస్థలు ఈ విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇక మరోవైపు నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం టర్కీలో తన రాబోయే చిత్రం NBK 107 షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఆ సినిమా గోపిచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న విషయం తెలిసిందే. అలాగే బాలకృష్ణ త్వరలోనే అనిల్ రావిపూడి దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయనున్నాడు. ఇక మరోవైపు అనుష్క కూడా యూవీ క్రియేషన్స్ లో ఒక సినిమా స్టార్ట్ చేసేందుకు సిద్దమవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X