twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    xxx web series నిర్మాత ఏక్తాకపూర్‌పై సుప్రీం కోర్టు సీరియస్.. యువతకు ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నారంటూ అక్షింతలు

    |

    బాలీవుడ్ టాప్ లేడి దర్శకనిర్మాతల్లో ఏక్తా కపూర్ ఒకరు. ఆమె ఇప్పటివరకు అనే సీరియల్స్, సినిమాలు, వెబ్ సిరీస్ లను రూపొందించారు. అయితే తాజాగా ఆమెపై భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు సీరియస్ అయింది. ఆమె ఇటీవల రూపొందించిన XXX వెబ్ సిరీస్ లో అభ్యంతకరమైన కంటెంట్ ఉందని వారించింది. అందరికీ అందుబాటులో ఉండే ఓటీటీ ప్లాట్ ఫామ్ వేదికగా ఇలాంటి వెబ్ సిరీస్ లు రూపొందించి యువతకు ఏం సందేశం ఇద్దామనుకుంటున్నారని ప్రశ్నించింది. అయితే ఈ వెబ్ సిరీస్ పై దాఖలైన పిటిషన్ లో భాగంగా ఏక్తా కపూర్ పై సెప్టెంబర్ 29న అరెస్ట్ వారెంట్ జారీ అయిన విషయం తెలిసిందే.

    గృహిణీలను ఎంటర్ టైన్ చేస్తూ..

    గృహిణీలను ఎంటర్ టైన్ చేస్తూ..

    బాలీవుడ్ పాపులర్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ఏక్తా కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మహిళా నిర్మాతగా మంచి పాపులారిటీ తెచ్చుకుంది. సీరియల్స్, వెబ్ సిరీస్ లు, సినిమాలు నిర్మిస్తూ ఆద్యంతం యూత్ ను, గృహిణీలను ఎంటర్ టైన్ చేస్తుంది. అయితే ఈ మధ్య ఆల్ట్ బాలాజీ అనే ఓటీటీ ఫ్లాట్ ఫామ్ వేదికగా వరుసగా అనేక అడల్ట్ కంటెంట్ వెబ్ సిరీస్ లను నిర్మించింది ఈ బ్యూటిఫుల్ ప్రొడ్యూసర్.

     అడల్ట్ కంటెంట్ ఉన్న వెబ్ సిరీస్..

    అడల్ట్ కంటెంట్ ఉన్న వెబ్ సిరీస్..

    ఈ క్రమంలోనే XXX అనే అడల్ట్ కంటెంట్ ఉన్న వెబ్ సిరీస్ ను నిర్మించింది ఏక్తా కపూర్. ఈ వెబ్ సిరీస్ మొదటి సీజన్ కు మంచి రెస్పాన్స్ రావడంతో రెండో సీజన్ ను ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించాంరు. అంతేకాకుండా అందులో పలు అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

     సైనికుల భార్యలను అవమానించారని..

    సైనికుల భార్యలను అవమానించారని..

    ఈ రెండో సీజన్ లో దేశ సైనికుల భార్యలను అవమానించారని, వారిని ఉద్దేశిస్తూ ఉన్న పలు సన్నివేశాలు వారి కుటుంబాలను కించపరిచే విధంగా ఉన్నాయని మాజీ సైనికుడు, బీహార్ లోని బేగుసరైకు చెందిన శంభు కుమార్ 2020లో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. అలాగే వారి మనోభావాలను దెబ్బ తీసేవిధంగా చిత్రీకరించారని ఆరోపించాడు.

    ఏక్తా కపూర్ పై అరెస్ట్ వారెంట్..

    ఏక్తా కపూర్ పై అరెస్ట్ వారెంట్..

    దీంతో బీహార్ లోని బేగుసరై ట్రైల్ కోర్టులో ఏక్తా కపూర్ పై అరెస్ట్ వారెంట్ కూడా ఇష్యూ అయింది. దీంతో కోర్టు అరెస్ట్ వారెంట్ ను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టుకి వెళ్లింది ఏక్తా కపూర్. ఆమె తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదించారు. తాము పాట్నా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశామని, కానీ అది త్వరగా పూర్తి అవుతుందని అనిపించకపోవడంతో ఇలా సుప్రీం కోర్టును ఆశ్రయించామని ఆయన తెలిపారు.

    సబ్ స్క్రిప్షన్ ఆధారంగా..

    సబ్ స్క్రిప్షన్ ఆధారంగా..

    అలాగే ఓటీటీలో వచ్చే కంటెంట్ సబ్ స్క్రిప్షన్ ఆధారంగా ఉంటుందని, నచ్చిన కంటెంట్ ను ఎంచుకునే హక్కు ఆడియెన్స్ కు ఉంటుందని అడ్వకేట్ ముకుల్ తెలిపారు. దీనిపై సుప్రీం కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ చురకలు అంటించింది. ఈ భారతదేశంలోని యువత మనసులను మీరు పాడు చేస్తున్నారని ఫైర్ అయింది. ఓటీటీలో వచ్చే వెబ్ సిరీస్ లు అందరికీ అందుబాటులో ఉంటాయి. అంటే దీని ద్వారా మీరు వారికి ఎలాంటి ఛాయిస్ ఇస్తున్నారని ప్రశ్నించింది.

    లోకల్ న్యాయావాదిని ఏర్పాటు చేసుకోండి..

    లోకల్ న్యాయావాదిని ఏర్పాటు చేసుకోండి..

    ''ఇలాంటి పిటిషన్ (అరెస్ట్ వారెంట్ పిటిషన్) వేసినందుకు మేం మీ క్లైంట్ (నిర్మాత ఏక్తా కపూర్) కు జరిమానా విధిస్తాం. ప్రతీసారి మీరు కోర్టుకు వచ్చేస్తారు. నోరున్న వారి కోసం కాదు ఈ కోర్టు ఉంది. మాట్లాడలేని వారి కోసం ఈ కోర్టు పనిచేస్తుంది. అన్ని సదుపాయాలున్న వారికే న్యాయం దక్కకపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి. మీ పిటిషన్ పై మాకు అభ్యంతరాలు ఉన్నాయి. పాట్నా హైకోర్టులోని విచారణ పరిస్థితి తెలుసుకునేందుకు లోకల్ న్యాయావాదిని ఏర్పాటు చేసుకోండి'' అని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది.

    English summary
    Supreme Court Serious On Producer Ekta Kapoor Over Get Arrest Warrant From Patna Court For Making XXX Web Series.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X