»   » అక్కడ సుప్రీం కిఅడ్డు పడుతున్న సూర్య?

అక్కడ సుప్రీం కిఅడ్డు పడుతున్న సూర్య?

Posted By:
Subscribe to Filmibeat Telugu

మెగాస్టార్ అనిపించుకోవటానికి ముందు చిరు సుప్రీం హీరో అనిపించుకున్నారు ఆ గుర్తింపుకి కూడా ఆయన చాలా కష్టపడాల్సివచ్చింది. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో సాయి ధరమ్ తేజ్‌ ఇప్పుడు అదె సుప్రీం హీరో ట్యాగ్ తోతనకంటూ ఓ సొంతఇమేజ్‌ కోసం కష్టపడుతున్నారు.

Supreme

కాస్త దూరం నుంచి చూస్తే సాయిథరమ్‌లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ పోలికలు కనిపిస్తాయి.కానీ పోలికలున్నంత మాత్రాన ప్టార్ డమ్ వచ్చేయదు కదా. ఇంకా నటనతొ తనని తాను నిరూపించుకునే ప్రయత్నం లోనే ఉన్నాడీ యంగ్ మెగాహీరో.

ఈ మధ్య ఓ సినిమాలో పవన్‌ స్టయిల్‌ను ఫాలో అయ్యాడని కూడా చెప్పుకున్నారు.ఇప్పుడు ఏకంగా ఆయన మెగాస్టార్ ఒకప్పటి బిరుదు సుప్రీంనే తన సినిమా టైటిల్‌గా ఎంచుకుని ప్రేక్షగాభిమానుల తీర్పు కోసంమే 5న థియేటర్ల ముందుకు వస్తున్నాడు.దిల్ రాజ్ ఈ చిత్రం పంపిణీ హక్కులను అభిషేక్ పిక్చర్స్‌కు ఫ్యాన్సీ రేటుకుఅమ్ముకున్నారు. అయితే ఓవర్‌సీస్ రైట్స్ మాత్రం అమ్ముడుకాలేదు.

దీంతో ఆయనే సొంతంగా విదేశాల్లో పేరున్నడిస్ట్రిబ్యూషన్ కంపెనీల ద్వారా సినిమాను రిలీజ్ చేస్తున్నారు. దిల్ రాజు చెప్పిన 1.5 కోట్ల రేటు ఇచ్చేందుకు ఓవర్‌సీస్డిస్ట్రిబ్యూటర్లు ఎవరూ ముందుకు రాకపోవడం ఒక కారణమట.ఇంకో సమస్య ఏమిటంటే సూర్య, విక్రమ్‌కుమార్‌ల 24 చిత్రం కూడా సుప్రీం కి పోటీగా విడుదలవుతుండటం కూడా ఓవర్‌సీస్డిస్ట్రిబ్యూటర్లు వెనుకంజ వేయడానికి మరో కారణమట. సుప్రీం కి విజయావకాశాలు తక్కువగా ఉండొచ్చేమో అన్న అనుమానంతోనే వెనుకాడుతున్నారట ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు.

ఏదిఏమైనా సుప్రీం అన్ని అవరోధాలు అధిగమించి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుందా? ఈ సినిమా తర్వాత సాయిథరమ్ తేజ్‌ పేరు ముందు సుప్రీం స్టార్ అనే బిరుదు కంఫార్మ్ ఔతుందా? లేదంటే అందరి అంచనాలను తలక్రిందులు చేస్తుందాఝ  తెలియాలంటే సుప్రీం వచ్చేవరకూ ఆగాల్సిందే...

English summary
Buyers are not ready to bet 1.5 crore on Supreme also clashing with Surya's movie 24
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu