»   » సంధ్య థియేటర్లో ‘సుప్రీం’ టీం సందడి (ఫోటోస్)

సంధ్య థియేటర్లో ‘సుప్రీం’ టీం సందడి (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సాయి ధరమ్ తేజ్, రాశి ఖన్నా హీరో హీరోయిన్లుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'సుప్రీం'. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్లో దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం గురువారం గ్రాండ్‌గా రిలీజైంది. సినిమా ప్రమోషన్లో భాగంగా చిత్ర యూనిట్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్యథియేటర్‌కు వచ్చి సందడి చేసారు.

ఈ సందర్భంగా సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ... సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. చూసినవారంతా సినిమా బావుందని చెబుతున్నారు. అన్ని ఏరియాల నుండి హిట్ వస్తోంది. నా కెరీర్లో ఇదో మంచి హిట్ సినిమాగా నిలిచిపోతుందనే నమ్మకం ఉంది' అన్నారు.

దిల్ రాజు మాట్లాడుతూ.... సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలతో తెరకెక్కింది. మంచి ఎంటర్టెనింగ్ సబ్జెక్ట్. ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ సినిమా. విడుదలైన అన్ని కేంద్రాల నుండి సినిమా బావుందనే టాక్ వస్తోంది అన్నారు.

స్లైడ్‌షోలో ఫోటోస్...

సాయి ధరమ్ తేజ్

సాయి ధరమ్ తేజ్


సంధ్య థియేటర్లో మీడియాతో మాట్లాడుతున్న సాయి ధరమ్ తేజ్.

శ్రీనివాస్ రెడ్డి తదితరులు..

శ్రీనివాస్ రెడ్డి తదితరులు..


సంధ్య థియేటర్లో శ్రీనివాస్ రెడ్డి తదితరులు....

దిల్ రాజు

దిల్ రాజు


సంధ్య థియేటర్లో సాయి ధరమ్ తేజ్, దిల్ రాజు....

సంధ్య థియేటర్ వద్ద సందడి

సంధ్య థియేటర్ వద్ద సందడి


సాయి ధరమ్ తేజ్ రాక సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద మెగా అభిమానులు సందడి చేసారు.

రాశి ఖన్నా

రాశి ఖన్నా


సంధ్య థియేటర్లో హీరోయిన్ రాశి ఖన్నా

English summary
Supreme Movie Team enthralls fans at Sandhya theatre.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu