For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఏఎన్ఆర్-దాసరి మధ్య గొడవపై నోరు విప్పిన సుప్రియ...తను కూడా కారణమా?

By Bojja Kumar
|

'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' ఈ సినిమా ద్వారా మెగాస్టార్ సోదరుడు పవన్ కళ్యాణ్, అక్కినేని నాగేశ్వరరావు మనవరాలు సుప్రియ ఇండస్ట్రీకి యాక్టర్లుగా పరిచయం అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ వరుస సినిమాలు చేస్తూ పవర్ స్టార్‌గా, టాలీవుడ్ టాప్ హీరోగా ఎదిగారు. అయితే సుప్రియ మాత్రం ఈ సినిమా తర్వాత నటనకు దూరమైంది. ఆ తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ నిర్వహణ బాధ్యతలు చూసుకోవడంలో బిజీ అయిపోయారు. దాదాపు 22 ఏళ్ల తర్వాత ఇటీవల విడుదలైన 'గూఢచారి' సినిమాతో నటిగా రీ ఎంట్రీ ఇచ్చారు. తాజాగా 'అలీతో సరదాగా' షోలో పాల్గొన్న ఆమె పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

 ఏఎన్ఆర్-దాసరి గొడవ గురించి

ఏఎన్ఆర్-దాసరి గొడవ గురించి

ఈ సందర్భంగా అలీ... సుప్రియ నుండి చాలా విషయాలు రాబట్టే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా అక్కినేని, దాసరి మధ్య అప్పుడెప్పుడో తలెత్తిన విబేధాల గురించి కూడా ప్రస్తావించారు. నీ వల్లే వారి మధ్య గొడవ జరిగిందట కదా? అనే ప్రశ్నకు సుప్రియ స్పందిస్తూ.... కొంత వరకు నేను కూడా కారణం అయ్యానేమో అని ఆమె వ్యాఖ్యానించారు.

ఏ స్థాయిలో విబేధాలు ఉండేవంటే..

ఏ స్థాయిలో విబేధాలు ఉండేవంటే..

అప్పట్లో ఏఎన్ఆర్-దాసరి మధ్య ఉన్న విబేధాలు ఏస్థాయిలో ఉండేవంటే.... విబేధాలు రోజురోజుకీ ముదిరి ఇద్దరి మధ్య దూరం బాగానే పెంచాయి. తెలుగు సిరీ పరిశ్రమకు సంబంధించి ఏ కార్యక్రమం జరిగినా....ఒకరు హాజరైతే, మరొకరు హాజరు కానంతగా అవి పెద్దవయ్యాయి. దాసరి నారాయణ రావు సతీమణి పద్మ మరణించినా అక్కినినితో పాటు ఆయన వారసులెవరూ పరామర్శకు రాలేదు. కనీసం ఫోన్లో కూడా పరామర్శించలేదని అప్పట్లో ప్రచారం జరిగింది.

Art Director Anand Sai Talks About Pawan Kalyan Remuneration
గొడవకు కారణం ఏమిటి?

గొడవకు కారణం ఏమిటి?

ఈ పరిస్థితికి కారణం డబ్బు విషయంలో ఇద్దరి మధ్య వచ్చిన విబేధాలే అని అప్పట్లో ఫిల్మ్ నగర్ లో చర్చించుకున్నారు. ఆ రోజుల్లో అన్నపూర్ణ స్టూడియోలో దాసరి స్వీయ నిర్మాణంలో ఓ సినిమా తీశారని, స్టూడియో రెంటు, ప్రొడక్షన్ పరికరాకు సంబంధించిన విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు అప్పట్లో టాక్.

 దూకుడుగా వ్యవహరించానేమో?

దూకుడుగా వ్యవహరించానేమో?

ఈ గొడవ విషయంలో సుప్రియ.... అలీతో సరదాగా కార్యక్రమంలో స్పందిస్తూ.. ‘ స్టూడియో నిర్వహణలో జాయిన్‌ అయినప్పుడు నాకు 18 సంవత్సరాలు. ప్రతి విషయంలోనూ చాలా స్ట్రిక్ట్‌గా ఉండాలని అనుకునేదాన్ని, పెద్ద వాళ్ల విషయంలో ఎలా మాట్లాడాలో అపుడు నాకు అంతగా తెలిసేది కాదు, అపుడు కాస్త దూకుడుగా ప్రవర్తించానేమో? అనిపిస్తుంటుంది' అన్నారు.

 అపుడు ఇద్దరూ బానే ఉండేవారు, కానీ..

అపుడు ఇద్దరూ బానే ఉండేవారు, కానీ..

నా చిన్నప్పుడు తాతగారికి దాసరి నారాయణరావుగారికి మధ్య మంచి స్నేహం ఉండేది. వారి మధ్య పెద్ద విబేధాలు ఏమున్నాయో నాక్కూడా తెలియదు. వారి మధ్య విబేధాలు మరింత ముదరడానికి నేను చిన్న పాత్ర పోషించానని అనుకుంటున్నా.... అని సుప్రియ తెలిపారు.

అర్దరాత్రి దాసరిగారి ఇంటికెళ్లా, ఆ మాత్రం పొగరుండాలిలే అన్నారు

అర్దరాత్రి దాసరిగారి ఇంటికెళ్లా, ఆ మాత్రం పొగరుండాలిలే అన్నారు

దాసరిగారు చనిపోతారన్న ఏడాది ముందు ఆయనతో నాకు ఒక అవసరం వచ్చింది. అర్ధరాత్రి 12గంటలకు ఆయన ఇంటికి వెళ్లాను. లోపలికి వెళ్లిన తర్వాత ఏమీ మాట్లాడకుండా అలాగే నిలబడి పోయాను. ‘వచ్చావా! నాగేశ్వరరావుగారి మనవరాలంటే ఆ మాత్రం పొగరుండాలిలే. కూర్చో. ఏం తింటావు' అన్నారు. చిన్న చిన్న కోపాలు, పట్టుదలలు అందరికీ ఉంటాయి అని సుప్రియ గుర్తు చేసుకున్నారు.

English summary
After Akkada Ammayi Ikkada Abbayi movie ANR Grand Daughter Supriya Yarlagadda is returning to films with Goodachari after a gap of more than 20 years.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more