పవన్ కళ్యాణ్‌తో ఎన్నో ఇబ్బందులు పడ్డా.. బాధతో కన్నీళ్లు ఆగేవికాదు: పవర్ స్టార్ ఫస్ట్ హీరోయిన్

Recommended Video

Supriya Yarlagadda Interesting Comments About Pawan Kalyan || Filmibeat Telugu

సినీ కెరీర్‌లో అంచెలంచెలుగా ఎదిగి అశేష అభిమాన వర్గాన్ని కూడగట్టుకున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇటీవలే తన సినీ కెరీర్‌ని పక్కనబెట్టేసి రాజకీయాల వైపు అడుగులు వేసిన ఆయన.. విజయపు రుచి చూడలేకపోయారు. అయినప్పటికీ రాజకీయాల్లోనే ఉంటానని, ఇక సినిమాలు చేసేదే లేదని తేల్చి చెప్పాడు. కాగా ఇన్నాళ్లకు పవన్ కళ్యాణ్‌తో నటించిన తొలి హీరోయిన్ యార్లగడ్డ సుప్రియ ఆయన గురించి వెల్లడించిన కొన్ని విషయాలు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. ఇంతకీ సుప్రియ చెప్పిన సంగతులేంటి? పవన్‌తో ఆమె అనుభవం ఎలాంటిది? వివరాల్లోకి పోతే..

అది 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' టైమ్

అది 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' టైమ్

పవన్ కళ్యాణ్ కెరీర్‌లో వచ్చిన మొదటి సినిమా 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి'. 1996లో విడుదలైన ఈ సినిమాతో మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా పవన్ కళ్యాణ్ వెండితెరకు పరిచయం కాగా, అక్కినేని నాగేశ్వరరావు మనవరాలిగా యార్లగడ్డ సుప్రియ సినీ గడప తొక్కింది. అప్పట్లో ఈ సినిమా మీడియం రేంజ్‌లో హిట్ అయింది. ఆ తర్వాత పవన్ పలు సినిమాలతో ఆకట్టుకొని పవర్ స్టార్ అయ్యాడు.

పవన్‌తో అనుభవం.. సుప్రియ చెప్పిన సంగతులు

పవన్‌తో అనుభవం.. సుప్రియ చెప్పిన సంగతులు

అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా తర్వాత చాలాకాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్న సుప్రియ.. ఇటీవలే 'గూడాచారి' సినిమాతో మరోసారి వెండితెరపై దర్శనమిచ్చింది. ఈ గ్యాప్‌లో అన్నపూర్ణ స్టూడియోస్‌కి సంబందించిన వ్యాపార వ్యవహారాలు చూసుకుంది సుప్రియ. అయితే తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన తొలి సినిమా అనుభవాలు, పవన్ గురించిన ఆసక్తికర విషయాలు చెప్పింది యార్లగడ్డ సుప్రియ.

పవన్‌లో టెన్షన్.. తరచూ గొడవలే

పవన్‌లో టెన్షన్.. తరచూ గొడవలే

పవన్ కళ్యాణ్ కెరీర్‌లో అది తొలి సినిమా కావడంతో ఆయన చాలా టెన్షన్ పడేవారని చెప్పింది సుప్రియ. ఆ సమయంలో సినీ ఇండస్ట్రీలో కొన్ని స్ట్రైక్స్ నడుస్తుండటంతో తన సినిమా విడుదలవుతుందో లేదో అని తెగ టెన్షన్ ఫీల్ అయ్యేవాడు పవన్ అని చెప్పింది. అలాగే ఈ సినిమా షూటింగ్ సమయంలో తామిద్దరం సరదాగా తరచూ గొడవ పడేవారని చెప్పుకొచ్చింది సుప్రియ.

పవన్‌తో చాలాసార్లు ఇబ్బందులు పడ్డా

పవన్‌తో చాలాసార్లు ఇబ్బందులు పడ్డా

అప్పటి హీరోలు జుట్టు పెంచుకొని పెద్ద పెద్ద మీసాలు, గుబురు గడ్డంతో ఉండేవారని.. ఆ స్టైల్ లోనే పవన్ కూడా ఉండేవారని చెప్పింది సుప్రియ. ఇలా ఉండటం వల్ల పవన్‌తో సెట్స్‌పై ఉన్నపుడు ఆయన ఎక్స్‌ప్రెషన్స్ అస్సలు అర్థమయ్యేవి కాదని, ఆ రకంగా ఆయనతో చాలాసార్లు ఇబ్బందులు పడ్డానని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంది సుప్రియ.

పవన్ తీరు బాధపెట్టేది.. కన్నీరు ఆగేది కాదు

పవన్ తీరు బాధపెట్టేది.. కన్నీరు ఆగేది కాదు

ఇక ఈ సినిమాలో కార్లు చేతులపై పోనివ్వడం, బండరాళ్లు శరీరంపై పగలగొట్టుకోవడం లాంటి ఫీట్స్ పవన్ రియల్‌గా చేయడం చూసి తాను ఎంతో బాధ పడేదానినని సుప్రియ తెలిపింది. పవన్ ఆలా చేస్తుంటే కళ్లల్లో నుంచి కన్నీరు ఆగేది కాదని చెప్పుకొచ్చింది. పైగా పవన్ కళ్యాణ్ తెగ సిగ్గు పడేవారని, ఆయనతో నటించడం ఓ మంచి అనుభూతి అని పేర్కొంటూ ఆనాటి సంగతులు గుర్తు చేసుకుంది యార్లగడ్డ సుప్రియ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X