కళ్యాణ్ ఈజ్ కళ్యాణ్.. పవన్ కళ్యాణ్ ఈ రేంజ్‌లో అసలు ఊహించలేదు.. సుప్రియ!

గూఢచారి చిత్రంతో 22 ఏళ్ల తరువాత నటి సుప్రియ వెండి తెరపై ఎంట్రీ ఇచ్చింది. ఏఎన్నార్ మనవరాలు అయిన సుప్రియ 22 ఏళ్ల క్రితం పవన్ కళ్యాణ్ సరసన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రంలో నటించింది. ఆ చిత్రం తరువాత సుప్రియ వెండి తెరపై కనిపించలేదు. ఇన్నేళ్ల తరువాత గూఢచారి లాంటి స్పై థ్రిల్లర్ మూవీలో రీఎంట్రీ ఇవ్వడం విశేషం. తాజగా ఓ ఇంటర్వ్యూ లో సుప్రియ ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

ఆశ్చర్యపోయా

ఆశ్చర్యపోయా

అడవిశేష్, శశి కిరణ్ గూఢచారి కథ నాకు వినిపించడానికి వచ్చారు. ఆ సమయంలో నేను అన్న పూర్ణ స్టూడియోస్ నిర్మాణ పనులు చూస్తున్నాను. ఆ కోణం లో కథ చెప్పడానికి వచ్చారని అనుకున్నా. కానీ ఈ చిత్రంలో తాను నటించే పాత్ర ఉందని చెప్పడంతో ఆశ్చర్యపోయినట్లు సుప్రియ తెలిపింది. కథ కొత్తగా అనిపించడంతో నటించడానికి అంగీకరించినట్లు పేర్కొంది.

Recommended Video

Art Director Anand Sai Talks About Pawan Kalyan Remuneration
చాలా మారిపోయింది

చాలా మారిపోయింది

ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా సినిమా మేకింగ్ లో చాలా మార్పులు వచ్చాయని సుప్రియ తెలిపింది. గతంలో హీరో, హీరోయిన్, తల్లి, తండ్రి ఇలాంటి పాత్రలే ఉండేవి. కానీ ఇప్పుడు కొత్త తరహా పాత్రలతో కొత్త కథలు వస్తున్నాయి.

అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి

అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి

అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రం తరువాత హీరోయిన్ గా కొనసాగకపోవడానికి సుప్రియ కారణం వివరించింది. హీరోయిన్ గా ఈ చిత్రంలో ఓ ప్రయత్నం చేశా. కానీ వర్కౌట్ కాలేదు. వెంటనే ప్రొడక్షన్ లోకి దిగిపోయా అని సుప్రియ తెలిపింది.

 ఏఎన్నార్ మనవరాలు

ఏఎన్నార్ మనవరాలు

గూఢచారి చిత్రం విడుదలయ్యాక నిర్మాతకు రాజమండ్రి నుంచి ఓ వ్యక్తి ఫోన్ చేశాడట. నాగేశ్వరావు గారి మనవరాలు చాలా బాగా చేసింది అని చెప్పారట. గూఢచారి చిత్రం విషయంలో తాను ప్రశంస అదే అని సుప్రియ తెలిపింది.

 పవన్ కళ్యాణ్ హీరోయిన్

పవన్ కళ్యాణ్ హీరోయిన్

ఇప్పటికి తనని పవన్ కళ్యాణ్ హీరోయిన్ అనే చాలా మంది పిలవడం గురించి సుప్రియ స్పందించింది. అంతా పవన్ హీరోయిన్ అంటున్నారేంటి.. నాకు సొంతంగా గుర్తింపు లేదా అని సరదాగా వ్యాఖ్యానించింది. కానీ పవన్ కళ్యాణ్ ఈజ్ పవన్ కళ్యాణ్. ఆయన పెద్ద స్టార్.

ఊహించనేలేదు

ఊహించనేలేదు

అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రం చేసే సమయంలో నా వయసు 18 ఏళ్ళు. పవన్ కళ్యాణ్ కి 25 ఏళ్ళు. పవన్ కళ్యాణ్ ఈ రేంజ్ లో స్టార్ అవుతాడని అసలు ఊహించనేలేదు అని సుప్రియ తెలిపింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X