»   »  జియాఖాన్‌ సూసైడ్ : మరో మలుపు

జియాఖాన్‌ సూసైడ్ : మరో మలుపు

Posted By:
Subscribe to Filmibeat Telugu
ముంబయి: సూసైడ్ చేసుకున్న జియాఖాన్ కేసు మరో మలుపు తిరిగింది. బాలీవుడ్‌ నటీమణి జియాఖాన్‌ని ఆత్మహత్యకు పాల్పడేలా ప్రేరేపించాడన్న అభియోగాలపై ఆమె ప్రియుడు సూరజ్‌ పంచోలీ(21)ని పోలీసులు అరెస్టుచేశారు.


జియా చనిపోవడానికి ముందు రాసిన లేఖను ఆమె తల్లి పోలీసులకు అందజేశారు. అందులో జియాఖాన్‌ ప్రస్తావించిన అంశాల ఆధారంగా పోలీసులు సూరజ్‌ పంచోలీని అరెస్టు చేశారు. సూరజ్‌ తల్లిదండ్రులైన ఆదిత్య పంచోలీ, జరీనాలు ఇద్దరు నటులే.

సూసైడ్ నోట్లోని వివరాల ప్రకారం....జియాను ఆమె బాయ్ ఫ్రెండ్ రేప్ చేసాడని, ఆ తర్వాత ఆమెకు అబార్షన్ చేయించినట్లు స్పష్టం అవుతోంది. ప్రేమ పేరుతో బలవంతంగా ఆమెను అనుభవించాడు. గర్భం దాల్చడంతో బలవంతంగా అబార్షన్ చేయించాడు. ఈ విషయాలన్నీ ఆమె తన సూసైడ్ నోట్లో వెల్లడించింది.

బాయ్ ఫ్రెండ్ రేప్ చేసినప్పటికీ....ప్రేమించే వాడే కదా అని ఆమె మిన్నకుంది. కానీ అతని నుంచి ఎలాంటి ప్రేమ, కమిట్ మెంట్ లేక పోవడంతో మానసికంగా కృంగి పోయింది. బాయ్ ఫ్రెండ్ తనను మెంటల్‌గా, ఫిజికల్‌గా బాధించిన విషయాన్ని కూడా జియా తన సూసైడ్ లేఖలో పేర్కొంది.


బాలీవుడ్‌ నటి జియాఖాన్‌ ఆత్మహత్య వివాదంలో తన కొడుకు సూరజ్‌ను విలన్‌ను చేయొద్దని నటుడు ఆదిత్య పంచోలి కోరారు. ఎటువంటి ఆధారాలు లేకుండా తన కుమారుడిపై అభియోగాలు మోపొద్దని విజ్ఞప్తి చేశారు. ఒకవేళ సూరజ్‌ తప్పుచేసినట్లు రుజువైతే అతన్ని నింధించడంలో తప్పులేదన్నారు. జియాఖాన్‌ ఆత్మహత్య నేపథ్యంలో రచయిత శోభా దే తన బ్లాగులో ఆదిత్య, సూరజ్‌లను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఆదిత్య పై విధంగా స్పందించారు.

English summary

 The Juhu police Monday evening arrested Sooraj Pancholi, son of actors Aditya Pancholi and Zarina Wahab, for allegedly abetting the suicide of actor Jiah Khan. The arrest came after her mother, Rabiya Amin, submitted a six-page letter, purportedly written by Jiah, detailing the "difficult relationship" between Jiah and Sooraj. 
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu