»   » ప్రియుడితో జియా ఖాన్ ముద్దు (లీకైన ఫోటో)

ప్రియుడితో జియా ఖాన్ ముద్దు (లీకైన ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : బాలీవుడ్ నటి జియా ఖాన్ గత కొన్ని రోజుల క్రితం ముంబై జుహులోని తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఆమె మరణం తర్వాత అనేక వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ప్రియుడు సూరజ్‌తో సంబంధం కారణంగా ఏర్పడ్డ వివాదాలే ఆమె ఆత్మహత్యకు కారణమని తేలింది.

తాజాగా వీరిద్దరి మధ్య ఎంత ఘాటు ప్రేమాయనం నడిచిందో తెలియజేసే ఓ ఫోటో లీకైంది. ఓ పార్టీలో జియా ఖాన్‌ను సూరజ్ పంచోలి తనివితీరా ముద్దాడుతున్నట్లు స్పష్టమైంది. దీన్ని బట్టి వీరి మధ్య డీప్ లవ్ ఎఫైర్ ఉందని స్పష్టం అవుతోంది. సూరజ్ కారణంగా జియా ఖాన్ గర్భం దాల్చిన విషయం, అబార్షన్ చేయించుకున్న విషయం కూడా ధృవీకరించబడింది. ఆమె రాసిన లేఖను బట్టి సూరజ్ మోసం చేయడం, తనను మానసికంగా, శారీరకంగా హింసించడం వల్లనే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.

జియా ఖాన్ ఆత్మహత్య కేసు విషయంలో పలు ఆధారాలు లభించడంతో సూరజ్ ను పోలీసులు అరెస్టు చేసారు. ప్రస్తుతం సూరజ్ పంచోలి జైల్లో ఉన్నాడు. ఇటీవల అతను బెయిల్ కోసం కోర్టును అభ్యర్థించగా....కోర్టు అతని అభ్యర్థనను తిరస్కరించింది. జియా ఖాన్ సూసైడ్ కేసు విచారణ కీలక దశలో ఉందని, ఇప్పుడు సూరజ్‌కు బెయిల్ ఇవ్వడం వల్ల పరిశోధన దెబ్బతింటుందని ప్రాసిక్యూషన్ వాదించింది.

జియా ఖాన్ బుగ్గపై ఎంతో ప్రేమగా సూరజ్ ముద్దాడుతున్న దృశ్యం. జియా మరణం తర్వాత వీరి సంబంధానికి బలమైన సాక్ష్యంగా నిలిచే అరుదైన ఫోటో ఇది. మరి వీరి మధ్య విబేధాలు ఎలా వచ్చాయో ఏమో?

జియా ఖాన్ జూన్ 3న ముంబై జుహులోని తన అపార్టుమెంటులో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. తొలుత పోలీసులు ఆమె ఆత్మహత్యకు కారణం కేవలం కెరీర్లో ఆటుపోట్ల వల్ల ఒత్తిడే అని భావించి కేసు నమోదు చేసుకున్నారు. కానీ జియా ఖాన్ రాసిన సూసైడ్ నోట్ దొరకడంతో ఎన్నో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

జియా ఖాన్ లేఖ ఆధారంగా సూరజ్ ను అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో హాజరు పరుగా, ఈ నెల 27 వరకు అతనికి జుడీషియల్ కష్టడీ విధించింది.

జియా తన లేఖలో బాయ్ ఫ్రెండ్ సూరజ్ కారణంగా మెంటల్‌గా, ఫిజికల్‌గా బాధను అనుభవించానని, సూరజ్ పంచోలి కారణంగా తాను రేప్ చేయబడ్డానని, అతను తన జీవితాన్ని నాశనం చేసాడని పేర్కొంది.

బెయిల్ కోసం కోర్టును అభ్యర్థించగా....కోర్టు అతని అభ్యర్థనను తిరస్కరించింది.

English summary
Much have been said and written about actress Jiah Khan's violent relationship with boyfriend Suraj Pancholi. Suraj, who was arrested in connection with Jiah's suicide a few weeks back, is reportedly facing a hard time.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu