Don't Miss!
- Sports IPL 2024: హార్దిక్ పాండ్యా చెత్త కెప్టెన్సీనే ముంబై ఇండియన్స్ కొంపముంచింది: క్రీడా మంత్రి
- Lifestyle పనీర్ బటర్ మాసాలాను ఇలా రెస్టారెంట్ స్టైల్లో తయారు చేసుకోండి..!
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- News విశాఖలో కూటమికి బిగ్ షాక్.. వైసీపీలో చేరిన కీలక నేత
- Automobiles క్రాష్ టెస్ట్‌లో శభాష్ అనిపించిన కియా కేరెన్స్.. ఆ విభాగంలో 5 స్టార్ రేటింగ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
Sree Leela: వివాదంలో పెళ్ళిసందD హీరోయిన్.. నా కూతురు కాదు, ఆస్తి కోసమే అంటూ సంచలనం!
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో పెళ్లి సందD అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. శ్రీకాంత్ కుమారుడు రోషన్ హీరోగా నటించిన ఈ సినిమా పెళ్లి సందడి సినిమాకి సీక్వెల్ గా వచ్చిందని ప్రచారం జరిగింది కానీ దానికి దీనికి ఏ మాత్రం సంబంధం లేదని అంటున్నారు ప్రేక్షకులు. ఆ సంగతి అలా ఉంచితే ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన శ్రీ లీల ఇప్పుడు అనుకోని వివాదాల్లో చిక్కుకుంది. ఆ వివరాల్లోకి వెళితే.
రాఘవేంద్రరావు పర్యవేక్షణలో
దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో ఆయన శిష్యురాలు గౌరీ రోణంకి దర్శకత్వంలో పెళ్లి సందD అనే సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. శ్రీకాంత్ కుమారుడు రోషన్ హీరోగా తెలుగమ్మాయి స్త్రీల హీరోయిన్ గా ఈ సినిమా రూపొందగా దసరా సందర్భంగా అక్టోబర్ 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి ఆట నుంచి మంచి స్పందన తెచ్చుకున్న ఈ సినిమా తర్వాత తర్వాత మిశ్రమ స్పందన తెచ్చుకుంది.
అనుకోని వివాదాల్లో
అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన శ్రీ లీల ఇప్పుడు అనుకోని వివాదాల్లో చిక్కుకుంది. విషయం ఏమిటంటే శ్రీ లీల తన కుమార్తె అంటూ ప్రచారం చేస్తున్నారు కానీ ఆమె తన కుమార్తె కాదు అంటూ తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త సూరపనేని సుభాకర రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. పెళ్లిసందD హీరోయిన్స్ శ్రీ లీలకు తనకు ఎలాంటి సంబంధం లేదని శ్రీ లీల తన మాజీ భార్య కుమార్తె అని చెప్పుకొచ్చారు. మేము విడిపోయిన తర్వాత జన్మించింది కాబట్టి ఆమె తన కుమార్తె కాదని ఆయన అంటున్నారు.
నా కూతురు కాదు
అయితే సూరపనేని సొసైటీ మాత్రం ఆమె నా కుమార్తె అంటూ ప్రచారం చేస్తోందని, సూరపనేని ఫౌండేషన్ పేరుతో ఒక ఇన్విటేషన్ కార్డు క్రియేట్ చేసి ఈ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తన మాజీ భార్య కూతురు తన కూతురు గా ప్రచారం చేస్తున్నారు అంటే తన ఆస్తిలో వాటా పొందేందుకు ఇలా చేస్తున్నారు అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.
కోర్టుకు వెళ్తా
ఇలా చేసినందుకు గాను తాను లీగల్ గా ముందుకు వెళ్తానని చెప్పుకొచ్చారు. ఇక తమ విడాకుల విషయం మీద ఇంకా కేసులు నడుస్తున్నాయని సుభాకర రావు పేర్కొన్నారు. శ్రీ లీల తన కుమార్తె కాదు అని సూరపనేని సొసైటీకి కూడా ఫిర్యాదు చేశానని ఆయన చెబుతున్నారు. శ్రీ లీల తెలుగు అమ్మాయి అయినా కన్నడనాట కొన్ని సినిమాలు చేసింది.
Recommended Video
డాక్టర్ చదువుతూ
అలా చేసిన సినిమాలు రాఘవేంద్రరావు దృష్టిలో పడటంతో ఆమె ఈ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది. ఈ భామ ప్రస్తుతం ముంబైలో డాక్టర్ కోర్స్ చదువుతోంది. సినిమా షూటింగ్ నిమిత్తం గ్యాప్ తీసుకుని షూటింగ్ లో పాల్గొంటున్న ఈ భామ డాక్టర్ చదివి ప్రజలకు సేవ చేస్తానని చెబుతోంది. మొత్తం మీద ఈ వ్యవహారం మాత్రమే ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.