నేను ప్రేమలో ఉన్నాను.. సురేఖా వాణి షాకింగ్ పోస్ట్.. అసలు విషయమిదే!
టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖా వాణి సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక విషయంలో ట్రెండ్ అవుతూనే ఉంటుంది. ఈ మధ్య సినిమాల్లో ఎక్కువగా కనిపించడం లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజ్‌లో దూసుకుపోతోంది. సురేఖా వాణి, తన కూతురు సుప్రిత కలిసి సోషల్ మీడియాను ఎలా వాడేస్తుంటారో అందరికీ తెలిసిందే. ఈ ఇద్దరూ కలిసి చేసే సందడికి నెటిజన్లు షాక్ అవుతుంటారు.

తెరపై అలా..
సురేఖా వాణి తెరపై పోషించే పాత్రలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. కామెడీ సీన్స్, ఎమోషనల్ సీన్స్ అని తేడా లేకుండా అన్ని రకాల పాత్రల్లోనూ మెప్పిస్తుంది. ముఖ్యంగా శ్రీనువైట్ల చిత్రాల్లో సురేఖా వాణికి మంచి ప్రాతలు పడుతుంటాయి.

సోషల్ మీడియాలో ఇలా..
తెరపై కనిపించే సురేఖా వాణికి సోషల్ మీడియాలో కనిపించే సురేఖా వాణికి ఎంతో తేడా ఉంటుంది. మోడ్రన్ డ్రెస్సులు ధరిస్తూ, కూతురికి పోటీగావస్తున్నట్టు కనిపిస్తుంటుంది. సురేఖా వాణి తన భర్త చనిపోయాక సోషల్ మీడియాలో మరింతగా యాక్టివ్ అయింది.

రెండో పెళ్లిపై..
సింగర్ సునీత రెండో పెళ్లి చేసుకున్న సమయంలో సురేఖా వాణి మీద కొన్ని రూమర్లు వచ్చాయి. ఆమె కూడా రెండో పెళ్లికి సిద్దమైనట్టు కథనాలు వచ్చాయి. ఆ రూమర్లపై సురేఖా వాణి ఓ రేంజ్‌లో ఫైర్ అయింది. ఆమె కూతురు సుప్రిత కూడా మీడియాను ఏకిపారేసింది. ఉన్నవి రాయండి అంటూ ఘాటుగా విమర్శించింది.

తాజాగా ఇలా..
తాజాగా సురేఖా వాణి ఓ పోస్ట్ చేసింది. ఇందులో తన ఇష్టాన్ని బయట పెట్టేసింది. తాను ప్రేమలో ఉన్నాననిచెప్పింది. కానీ ప్రేమలో ఉన్న మాట వాస్తవమే అయినా.. అది మనిషి మాత్రం కాదు. ఆమె మెడకు ధరించిన నెక్లెస్‌తో ప్రేమలో ఉంది. ఈ విషయాన్నే సురేఖా వాణి చెబుతూ.. నెక్లెస్‌తో ప్రేమలో ఉన్నాను అని పేర్కొంది. ప్రస్తుతం సురేఖా వాణి పోస్ట్ వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











