పెళ్లి కాకుండానే తల్లైన సురేఖ వాణి కూతురు!.. ఘనంగా ‘కొడుకు’బర్త్ డే వేడుకలు
టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖా వాణి, ఆమె కూతురు సుప్రిత సోషల్ మీడియాలో ఎంతగా రచ్చ చేస్తారో అందరికీ తెలిసిందే. టిక్ టాక్ వీడియోలంటూ, ఫోటో షూట్‌లంటూ, విదేశాల్లో వెకేషన్స్ అంటూ తల్లీ కూతుళ్లు చేసే హంగామా అంతా ఇంతా కాదు. కూతురు సుప్రితను ఎక్కువగా లైమ్ లైట్‌లో ఉంచేందుకు సురేఖా చాలానే కష్టపడుతోంది. సుప్రితను హీరోయిన్‌గా ఎంట్రీ ఇప్పించాలనే చాలానే ప్రయత్నిస్తోన్నట్టు టాక్ వినిపిస్తోంది. అందులో డ్యాన్సులు, అందాలతో సోషల్ మీడియాను షేక్ చేసేస్తోంది.

నాటి వీడియో హల్చల్..
ఆ మధ్య కాలంలో సురేఖా వాణి, తన కూతురు సుప్రిత చేసే డ్యాన్స్ వీడియో లీకవ్వడం ఎంతటి వివాదాన్ని రేకెత్తించిందో అందరికీ తెలిసిందే. కాలా చష్మా అంటూ పొట్టి డ్రెస్సుల్లో బెడ్రూంలో వేసిన స్టెప్పులు ఓ ఊపు ఊపేశాయి. ఇక ఆపై కొద్ది కాలానికి టిక్ టాక్ వంటి యాప్‌లో తమ సత్తాను చాటుతూ వచ్చారు.

టిక్ టాక్‌లో ఫేమస్..
తల్లీ కూతుళిద్దరూ టిక్ టాక్‌లో చాలా ఫేమస్. ఇద్దరూ కలిసి వేసే స్టెప్పులకు నెటిజన్లు ఫిదా అవుతుంటారు. ఇద్దరూ కూడా పొట్టి బట్టలు ధరించి హాట్ హాట్ డ్యాన్స్ వీడియోలను షేర్ చేస్తారు. ఇక అన్నింటి కంటే లుంగీ, కళ్లజోడు ధరించి చేసిన టిక్ టాక్ వీడియో విపరీతంగా వైరల్ అయింది.

హీరోయిన్ ప్రయత్నాల్లో..
ఇండస్ట్రీలో హీరోయిన్‌గా పరిచయం చేయాలని తన కూతురిని సోషల్ మీడియాలో ఇలా వైరల్ అయ్యేలా సురేఖ చేస్తోందని టాక్. సినిమాలకు పరిచయం చేయాలనే ఆసక్తి లేదని, ఒకవేళ తనకు ఇష్టం ఉంటే కాదనని ఆ మధ్య సురేఖ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

లవ్లీ గాడు..
కూతురు బర్త్ డే సందర్భంగా సురేఖ వాణి అదిరిపోయే సర్ ప్రైజ్‌ను ఇచ్చింది. అంతేకాకుండా కూతురిపై ఉన్న ప్రేమను చెబుతూ.. నా చిన్ని యువరాణికి హ్యాపీ బర్త్ డే. నువ్వే నా బలం, బలహీనత. నిన్ను, నీ వ్యక్తిత్వాన్ని ప్రతీ ఒక్కరూ ఇష్టపడతారు. నువ్ నీలాగే ఉండు. మీ డాడీ అక్కడి నుంచి చూస్తుంటాడు.. నీ వెంటే ఉంటాడు. నా సర్వస్వం నువ్వే. గాడ్ బ్లెస్ యూ సుప్రిత లవ్లీ గాడు.. ఐ లవ్ యూ.. ఎంజాయ్ చేయ్ కన్నా అంటూ ఎమోషనల్ అయింది.
Recommended Video

సుప్రిత కొడుకు అట..
తాజాగా సురేఖ వాణి, సుప్రిత కలిసి ఒకరి బర్త్ డేను సెలెబ్రేట్ చేశారు. అది వారు పెంచుకునే కుక్క (క్రిష్)‘హ్యాపీ బర్త్ డే క్రిష్. పైగా ఈ కుక్కకు ఇన్ స్టాగ్రాంలో ఓ స్పెషల్ పేజిని క్రియేట్ చేసింది. అందులో సన్ ఆఫ్ సుప్రిత అని కూడా యాడ్ చేసింది. మొత్తానికి సుప్రిత ఆ కుక్కను తన కొడుకుగా భావిస్తోంది. ఈ మేరకు సురేఖ వాణి స్పందిస్తూ.. నువ్ మా జీవితాల్లోకి వచ్చాకే ఆనందంగా మారింది. సుప్రిత నువ్ నాకెంతో ప్రత్యేకంగా.. లవ్యూ చిన్నితల్లి అంటూ పోస్ట్ చేసింది.


Click it and Unblock the Notifications











