Don't Miss!
- News
ఢీ అంటే ఢీ అంటున్న రెండు పవర్ సెంటర్లు?
- Finance
Home Loan: హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా..? కొత్త టాక్స్ సిష్టం బెటరా..? పాతదే మేలా..?
- Travel
సందర్శకులను కనువిందుచేసే కొల్లేరు బోటు షికారు!
- Sports
INDvsAUS : ఈ మూడు విషయాలే సిరీస్ విజేతను నిర్ణయిస్తాయి..!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Lifestyle
Valentines Day 2023: వాలెంటైన్స్ డే రోజు ఈ పనులు అస్సలే చేయొద్దు, ఉన్న మూడ్ పోయి సమస్యలు రావొచ్చు
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
మంచు లక్ష్మి సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతున్న సురేఖవాణి కూతురు.. అలాంటి పాత్రలో..
ఒకప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంటే సినిమా ప్రపంచం లో తప్పితే బయటి ప్రపంచంలో ఎక్కువగా కనిపించేవారు కాదు. కానీ మారుతున్న కాలానికి తగ్గట్టుగా నేటితరం నటీనటులు కూడా చాలా విభిన్నంగా అడుగులు వేస్తున్నారు. ఈ రోజుల్లో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వక ముందే జనాల్లోకి దగ్గరవుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఒక విధంగా సోషల్ మీడియా ద్వారా కూడా చాలా మంచి అవకాశాలు అందుకుంటున్నారు. నేటితరం నట వారసులు కూడా ముందుగానే సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ఉన్న విషయం తెలిసిందే. అలాంటి వారిలో సురేఖ వాణి కూతురు కూడా ఉంది. ఇక మొత్తానికి ఈమె టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

మంచి నటిగా..
తెలుగు చిత్ర పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన కంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న సురేఖవాణి మిగతా భాషల్లో కూడా నటిగా మంచి గుర్తింపు అయితే అందుకుంది. కేవలం ఒక తరహా పాత్రలు మాత్రమే కాకుండా విభిన్నమైన కామెడీ ఫ్యామిలీ సపోర్టింగ్ రోల్స్ తో ఆమె తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అయితే అందుకున్నారు.

సోషల్ మీడియాలో..
ఇక సోషల్ మీడియాలో సురేఖవాణి కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నిత్యం ఆమె సోషల్ మీడియాలో ఏదో ఒక ఫోటో తో నెటిజన్ల కు షాక్ ఇస్తూనే ఉంటుంది. ఇక ఆమె కూతురు సుప్రీత కూడా గ్లామర్ బ్యూటీ గా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

గ్లామర్ డామినేషన్
ఇక ఇద్దరు అప్పుడప్పుడు కలిసి చేసే ఇన్ స్టాగ్రామ్ రీల్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక విధంగా సురేఖ వాణి తన అందంతో కూతురిని డామినేట్ చేసే ప్రయత్నం చేస్తున్నట్లుగా కూడా అనిపిస్తూ ఉంటుంది. ఇద్దరు ప్రత్యేకంగా కొన్ని ఫొటో షూట్స్ లో కూడా కలిసి పాల్గొంటారు. ఇక బర్త్ డే పార్టీలు వస్తే ఏ మాత్రం సందేహించకుండా ఎంతో సంతోషంగా ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో కలిసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు.

టాలీవుడ్ ఎంట్రీ..
అయితే సురేఖ వాణి కూతురు కూడా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టబోతున్నట్లు గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ సినిమాలో హీరోయిన్ గా సెలెక్ట్ అయినట్లు కూడా కథనాలు వెలువడ్డాయి. కానీ అందులో ఎలాంటి నిజం లేదు అని సురేఖ వాణి అప్పుడే క్లారిటీ ఇచ్చింది. అంతేకాకుండా ఇంకా తన కూతురు ఇండస్ట్రీ లోకి రావాలని ఆలోచనల్లోకి రాలేదని కానీ తను ఇష్టంగా వస్తే మాత్రం తప్పకుండా నేను స్వాగతిస్తానని అది తన వ్యక్తిగత నిర్ణయం నిర్ణయం అని ఆమె పాజిటివ్గా స్పందించారు.

మంచు లక్ష్మి సినిమాలో..
అయితే ఇప్పుడు సుప్రీత టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటిస్తున్న 'లేచింది మహిళా లోకం' అనే సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతోంది. కాలేజీ అమ్మాయిగా ట్రెడిషనల్ లుక్ లో సుప్రీత విభిన్నంగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఆమె క్యారెక్టర్ ఎంతవరకు క్లిక్కవుతుందో చూడాలి.