రోడ్డు ప్రమాదంలో వర్ధమాన నటి మృతి.. తీవ్ర విషాదంలో సురేఖవాణి!

తెలుగు సినీ నటి సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగులో ఎక్కువగా అక్క, వదిన పాత్రలకు ఫేమస్ అయిన ఆమె ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో హాట్ షో చేస్తూ మరింత ఫేమస్ అయింది. భర్త చనిపోయిన తరువాత కుమార్తెతో కలిసి ఆమె సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులు సంచలనంగా మారుతున్నాయి.

అయితే తాజాగా ఆమె తీవ్ర విషాదంలో మునిగిపోయారు. దానికి కారణం ఆమెకు సన్నిహితంగా ఉండే ఒక వర్ధమాన నటి రోడ్డు ప్రమాదంలో మరణించడం. రోడ్డు ప్రమాదంలో ఎవరు మరణించారు ? సురేఖ వాణి ఎందుకు అంత విషాదంలో మునిగిపోయారు. అనే వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

 విషాదంలో

విషాదంలో

తెలుగు సినీ నటి సురేఖా వాణి విషాదంలో మునిగిపోయారు. ఆమె కుమార్తె స్నేహితురాలు, తెలుగు యూట్యూబర్, వర్ధమాన నటి డాలీ డిక్రూజ్ అలియాస్ గాయత్రి రోడ్డు ప్రమాదంలో మరణించింది. హైదరాబాద్‌ గచ్చిబౌలిలో జరిగిన రోడ్ యాక్సిడెంట్‌లో డాలీ మరణించినట్టు తెలుస్తోంది. డాలీ అసలు పేరు డాలీ డి క్రూజ్ కాగా గాయత్రి, గాయత్రి డాలీ అనే స్క్రీన్ నేమ్స్‌తో యూట్యూబ్ లో ఆమె అనేక షార్ట్ ఫిల్మ్స్ చేశారు. డాలీతో పాటు కారు నడుపుతున్న రోహిత్ అనే వ్యక్తి, మరొక మహిళ కూడా మరణించారు.

సామజవరగమనా సిరీస్ లో

సామజవరగమనా సిరీస్ లో

మితిమీరిన వేగం కారు ప్రమాదానికి కారణమని పోలీసులు గుర్తించారు. డాలీ 'బిగ్ బాస్' ఫేమ్ సిరి హనుమంతు నటించిన 'మేడం సార్ మేడం అంతే' వెబ్ సిరీస్‌లో శ్రీహన్ మీద మనసు పారేసుకునే అమ్మాయిగా, ఆఫీస్ కొలీగ్‌గా నటించింది. ఇక ఆహా మినీ యూట్యూబ్ ఛానల్ లో ప్రసారం అవుతున్న సామజవరాగమనా సిరీస్ లో కూడా హీరోయిన్ స్నేహితురాలి పాత్రలో నటించింది. 'జల్సారాయుడు' అనే యూట్యూబ్ ఛానల్‌లో బడ్జెట్ రాఘవయ్యగారి అబ్బాయి అనే సిరీస్ లో లీడ్ రోల్ చేస్తోంది.

ప్రిజం అనే పబ్బులో

ప్రిజం అనే పబ్బులో

హోలీ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం బార్లు పబ్బులు అలాగే వైన్ షాపులు కూడా మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే చాలా చోట్ల హోలీ ఈవెంట్లు పేరుతో పబ్బుల్లో కూడా యధావిధిగా లిక్కర్ సర్వ్ చేశారు అనే ఆరోపణలు ఉన్నాయి. అందులో భాగంగానే హైదరాబాద్ లో ఉన్న ప్రిజం అనే పబ్బులో గాయత్రీ పార్టీ చేసుకున్నట్లు సమాచారం. తనకు స్నేహితుడైన రోహిత్ కారులో హోలీ వేడుకలకు హాజరు అయ్యారని చెబుతున్నారు.

కొన్ని సినిమాలు కూడా

కొన్ని సినిమాలు కూడా

హోలీ వేడుకలకు హాజరైన తర్వాత ఇంటికి బయలుదేరిన క్రమంలో గాయత్రి తాను కారు నడుపుతాను అని తీసుకోవడంతో రోడ్డు ప్రమాదం సంభవించినట్లు సమాచారం. రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే అక్కడికక్కడే గాయత్రి, రోహిత్ సహా మరో యువతి మృతి చెందినట్లు సమాచారం. అయితే వీళ్లు మద్యం సేవించి ఉన్నారా లేదా అనే విషయాలు పోస్ట్ మార్టం రిపోర్టు బయటకు వచ్చిన తర్వాత వెల్లడికానున్నాయి. ఇక ఆమె కొన్ని సినిమాలు కూడా చేశారని అంటున్నారు.

 మాటలు రావడం లేదు

మాటలు రావడం లేదు

అయితే నటి సురేఖా వాణి, ఆమె కుమార్తె సుప్రీతకు చాలా గాయత్రి చాలా క్లోజ్ అని తెలుస్తోంది. గతంలో సురేఖా వాణి ఫ్యామిలీతో కలిసి గాయత్రి గోవా వెళ్లారు. అక్కడే పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే డాలీ మృతి పట్ల సురేఖా వాణి, సుప్రీత తదితరులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.. "ఇది అన్యాయం డాలీ. నమ్మడానికి చాలా కష్టంగా ఉంది. నీతో ఎన్నో గొప్ప జ్ఞాపకాలు ఉన్నాయి. నాకు మాటలు రావడం లేదు" అని ప్రముఖ నటి సురేఖా వాణి ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఒక పోస్ట్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X