నీ కంటే వీధి కుక్కలు బెటర్.. దిమ్మతిరిగే కౌంటర్ వేసిన నటీమణి.. సురేఖావాణి షాకింగ్ కామెంట్స్

సురేఖావాణి.. తెలుగు సినీ పరిశ్రమలో ప్రతీ ఒక్కరికీ సుపరిచితం ఈ పేరు. క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మై ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పుపొందింది సురేఖ. కామెడీ పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే సురేఖా వాణి ఈ మధ్య సినిమాల్లో అంతగా కనిపించడం లేదు. అయినప్పటికీ సోషల్ మీడియా వేదికగా అందరితో టచ్‌లో ఉంటూనే ఉంది. తాజగా ఈమెకు సంబంధించిన ఓ ఇష్యూ హాట్ టాపిక్ కావడంతో వార్తల్లో నిలిచింది సురేఖ. ఇంతకీ ఏంటా ఇష్యూ? వివరాల్లోకి పోతే..

Recommended Video

Surekha Vani & Her Daughter Angry On a Netizen
సురేఖావాణి స్పీడ్.. సాఫీగా సినిమాలు

సురేఖావాణి స్పీడ్.. సాఫీగా సినిమాలు

వెండితెరపై కాలుమోపిన కొద్దిరోజుల్లోనే తన నటనతో మంచి గుర్తింపు సంపాదించింది సురేఖ. ''దుబాయ్ శీను, బొమ్మరిల్లు, బృందావనం, రెడీ, సుప్రీమ్'' లాంటి ఎన్నో సినిమాల్లో ఆమె అభినయం తెలుగు ప్రేక్షకుల గుండెల్లో అలా నిలిచిపోయింది. అక్క‌గా, వ‌దిన‌గా సాఫీగా సినిమాలు చేస్తూ వెళ్ళింది సురేఖా.

వన్నెతగ్గని గ్లామర్.. ఎప్పుడూ యాక్టివ్

వన్నెతగ్గని గ్లామర్.. ఎప్పుడూ యాక్టివ్

వయసు పెరుగుతున్నా వన్నెతగ్గని గ్లామర్ సురేఖా వాణి సొంతం. క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినప్పటికీ వెండితెరకు అందం తీసుకురావడంలో ఆమె పాత్ర కూడా ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు. అందుకే ఆమెకు ఫాలోయింగ్ కూడా ఎక్కువే. పైగా సోషల్ మీడియాలోనూ యమ యాక్టివ్‌గా ఉంటుంది ఈ సీనియర్ భామ.

అస్సలు వెనక్కితగ్గని సురేఖ.. అదే హాట్‌నెస్

అస్సలు వెనక్కితగ్గని సురేఖ.. అదే హాట్‌నెస్

ఇకపోతే ఈ మధ్యకాలంలో సురేఖా కెరీర్ స్లో అయింది. భర్త సురేష్ తేజ అనారోగ్యంతో మరణించడం, సినిమా అవకాశాలు తగ్గడం వెంటవెంటనే జరిగిపోయాయి. అయినప్పటికీ ఆ బాధను దిగమింగుతూ సామాజిక మాధ్యమాల వేదికగా అందరితోనూ టచ్ లోనే ఉంటుంది సురేఖా. కాకపోతే హాట్‌నెస్ విషయంలో అస్సలు వెనక్కితగ్గక పోవడం గమనించవచ్చు.

చిట్టిపొట్టి దుస్తులు.. కూతురుతో కలిసి రెచ్చిపోతూ..

చిట్టిపొట్టి దుస్తులు.. కూతురుతో కలిసి రెచ్చిపోతూ..

అదే సోషల్ మీడియాలో తన కూతురు సుప్రితతో కలిసి సురేఖ చేసే హంగామా మామూలుగా ఉండదు. టిక్ టాక్ వీడియోలంటూ నానా రచ్చ చేస్తుంది. చిట్టిపొట్టి దుస్తులు ధరించి దుమ్ములేపేస్తారు తల్లీకూతుళ్లు. ఆ మధ్య కాలా చష్మా, మొన్న బుట్టబొమ్మ అంటూ చేసిన వీడియో ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే.

పొట్టి దుస్తులు వేసుకొని ఆ డాన్సులేంటి? నెటిజన్ల ఆగ్రహం

పొట్టి దుస్తులు వేసుకొని ఆ డాన్సులేంటి? నెటిజన్ల ఆగ్రహం

దీంతో సురేఖ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న ఫొటోలు, వీడియోలకు మాత్రం ఎక్కువగా నెగిటివ్ కామెంట్లు వినిపిస్తున్నాయి. కూతురుతో అలాంటి పనులేంటి? ఆ పొట్టి దుస్తులు వేసుకొని ఆ డాన్సులేంటి? అంటూ నెటిజన్లు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినిమాల్లో సంప్రదాయంగా కనిపించే సురేఖా ఇలాంటివి ప్రోత్సహించడంపై నెగిటివ్ కామెంట్ చేశాడో నెటిజన్. ఒక కూతురిని ఇలా పెంచకూడదని పేర్కొంటూ కామెంట్ పెట్టాడు.

నీ కంటే వీధి కుక్కలు బెటర్

నీ కంటే వీధి కుక్కలు బెటర్

ఇది చూసిన సురేఖావాణి వెంట‌నే ఆ నెటిజ‌న్‌కి రిటర్న్ కౌంట‌ర్ ఇచ్చింది. నీలాంటి వీధి కుక్క‌లు లైఫ్ ని చాలా బాగా లీడ్ చేస్తాయి. ''నీ కంటే వీధి కుక్కలు లైఫ్‌ను చాలా బాగా లీడ్ చేస్తాయి. నీ ఆలోచనకు హ్యాట్సాఫ్'' అంటూ దిమ్మతిరిగే షాకిచ్చింది. దీంతో ఈ ఇష్యూ జనాల్లో హాట్ టాపిక్ అయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X