అవన్నీ తప్పుడు వార్తలే.. నా పర్మిషన్ లేకుండా.. సురేఖా వాణి స్వీట్ వార్నింగ్
టాలీవుడ్ నటి సురేఖా వాణి ఈ మధ్య వార్తల్లో తెగ వైరల్ అవుతోంది. రెండో పెళ్లికి సంబంధించిన రూమర్లు చక్కర్లు కొట్టడం, వాటిపై సురేఖా వాణి సీరియస్ అవ్వడం అందరికీ తెలిసిందే. అయితే రెండో పెళ్లిపై ఎన్ని సార్లు క్లారిటీ ఇచ్చినా కూడా సోషల్ మీడియాలో మాత్రం వార్తలు ఆగడం లేదు.. వచ్చే మీమ్స్ ఆగడం లేదు. తాజాగా తన రెండో పెళ్లిపై వచ్చిన మీమ్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది.
భర్తతో శృంగార భంగిమల్లో బీచిలో ఎంజాయ్ చేస్తున్న టాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు)

అలా గడిపేస్తోంది..
సురేఖా వాణి భర్త చనిపోయి రెండేళ్లు అవుతోంది. అప్పటి నుంచి కూతురు సుప్రితతో కలిసి ఒంటరిగానే ఉంటోంది. భర్తను తలుచుకుంటూ ఆమె చేసే పోస్ట్‌లు కూడా తెగ వైరల్ అవుతుంటాయి. కానీ ఈ మధ్య మాత్రం రెండో పెళ్లి గురించి బాగానే చర్చలు వస్తున్నాయి.

సునీత పెళ్లి..
సింగర్ సునీత రెండో పెళ్లి చేసుకుని హాయిగా కొత్త జీవితాన్ని ప్రారంభించింది. అయితే అదే దారిలో సురేఖా వాణి కూడా నడిచేందుకు రెడీ అవుతోందని రూమర్లు బయటకు వచ్చాయి. ఆ మధ్య విజయవాడకు తన బంధువుల ఇంటికి వెళ్లడంతో పెళ్లి పనుల కోసమే వెళ్లిందని వార్తలు రాసేశారు.

ఇద్దరూ ఫైర్..
అలా తన రెండో పెల్లి గురించి రూమర్లు రావడం, మీడియా సోషల్ మీడియాలో వార్తలు రావడంతో సురేఖా వాణి, తన కూతురు సుప్రిత తెగ ఫైర్ అయ్యారు. తనకు ఎలాంటి సోషల్ మీడియా ఖాతాలు లేవని, కేవలం ఇన్ స్టాగ్రాం మాత్రమే ఉందని, తన రెండో పెళ్లిపై వస్తోన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెప్పుకొచ్చింది.

ఉన్నవి రాయండి..
ఇక తన తల్లి రెండో పెళ్లి గురించి తప్పుడు వార్తలు రాస్తుండటంపై సుప్రిత ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉన్నవి రాయండి.. కొత్తవి క్రియేట్ చేసి రాయకండని సుప్రిత మీడియాకు సలహాలు ఇచ్చింది. మిమ్మల్ని మీరు జర్నలిస్ట్‌లు అని అనుకోకండని చురకలు అంటించింది.

తాజాగా అలా..
అయితే మళ్లీ సురేఖా వాణి తన రెండో పెళ్లిపై స్పందించింది. రెండో పెళ్లి అంటా.. లైన్‌లో నిల్చోవడానికి ముందు వరుసలో నేను నిల్చుంటా అంటూ వచ్చిన మీమ్‌పై సురేఖా వాణి సీరియస్ అయింది. అవన్నీ తప్పుడు వార్తలు.. అయినా నా పర్మిషన్ లేకుండా నా జీవితంలోకి రాకండి.. ఇలాంటివి రాయకండి అంటూ పరోక్షంగా స్వీట్ వార్నింగ్ ఇచ్చింది.


Click it and Unblock the Notifications











