టాలీవుడ్ డ్రగ్స్ కేసు.. వీడియో రిలీజ్ చేసిన సురేఖా వాణి.. ఏం చెప్పిందంటే?
డ్రగ్స్ కేసులో సినీ నిర్మాత కేపీ చౌదరి అరెస్టు టాలీవుడ్ లో కలకలం రేగుతోంది. కేపీ చౌదరి రిమాండ్ రిపోర్టులో విస్తూపోయే విషయాలు బయటకు వచ్చాయి. సినీ ఇండస్ట్రీలో చాలామంది పేర్లు బయటకు వస్తున్నాయి. ఇటీవల కేపీ చౌదరి కాల్ డేటాను పరిశీలించిన పోలీసులు.. సినీ ఇండస్ట్రికి చెందిన ప్రముఖుల పేర్లు బయటకు వచ్చాయి. అందులో అషు రెడ్డి, నటి జ్యోతి, సురేఖా వాణి పేర్లు బయటకు రాగా.. డ్రగ్స్ కేసుతో తమకు ఏ విధమైన సంబంధం లేదని స్పష్టం చేస్తున్నారు. సురేఖా వాణి సైతం ఓ వీడియో విడుదల చేశారు. ఆ వివరాల్లోకి వెళితే...
కదులుతున్న డొంక: డ్రగ్స్ కేసులో సినీ నిర్మాత కేపీ చౌదరి అరెస్టు కావడంతో... టాలీవుడ్ లోని ప్రముఖుల పేర్లు బయటకు వచ్చాయి. కేపీ చౌదరి కాల్ డేటాను పరిశీలించిన పోలీసులు బిగ్‌బాస్ కంటెస్టెంట్ ఆషు రెడ్డితో పాటు పలువురికి ఈ కేసుతో సంబంధాలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ముఖ్యంగా ఆషురెడ్డితో కేపీ చౌదరి వందలాది కాల్స్ మాట్లాడినట్లు సమాచారం బయటకు వచ్చింది. పోలీసుల విచారణలో కొంత మంది నటీమణులతో వందల సార్లు కేపీ ఫోన్ మాట్లాడినట్లు గురించారని వార్తలు వచ్చాయి.

వీడియో రిలీజ్..:అయితే ఈ కేసులో అషు రెడ్డితో పాటు.. నటి జ్యోతి, ప్రముఖ ఆర్టిస్ట్ సురేఖా వాణి నంబర్లు కేపీ చౌదరి ఫోన్ లో ఉన్నట్లు బయటకు వచ్చింది. ఆయన వాళ్లతో వందల సార్లు మాట్లాడినట్లు సమాచారం. ముఖ్యంగా గోవాలో కేపీ చౌదరి పార్టీలకు కుమార్తెతో సహా సురేఖా వాణి వెళ్లారని సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. దాంతో సురేఖా వాణి.. తన సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను రిలీజ్ చేసింది.

సురేఖా వాణి క్లారిటీ..:ఆ వీడియోలో సురేఖా వాణి.. ఈ డ్రగ్స్ కేసుపై వివరణ ఇచ్చారు. అందరికీ నమస్కారం... గత కొంత కాలంగా మాపై వస్తున్న ఆరోపణలకు, మాకు ఎటువంటి సంబంధం లేదు అంటూ వీడియోలో పేర్కోంది. దయ ఉంచి మాపై ఆరోపణలు చేయడం ఆపేయండి.. మీరు చేస్తున్న ఆరోపణల వల్ల మా కెరీర్, మా ఫ్యూచర్, మా పిల్లల కెరీర్, కుటుంబాలు, ఆరోగ్యం అన్ని రకాలుగా చాలా ఎఫెక్ట్ అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది.
నటి జ్యోతి ఫైర్..:అయితే అందులో సురేఖ వాణి.. కేపీ చౌదరి పేరు కానీ, డ్రగ్స్ గురించి కానీ ప్రస్తావించలేదు. మరోవైపు న్యూస్ ఛానళ్లలో తన ఫోటోలు రావడం పట్ల నటి జ్యోతి కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. అమ్మాయిల ఫోటోలు ఎందుకు పబ్లిష్ చేస్తున్నారని క్వశ్చన్ చేసింది. అబ్బాయిల ఫోటోలు ఎందుకు వేయడం లేదని జ్యోతి ఫైర్ అయింది.


Click it and Unblock the Notifications











