కూతురికి బర్త్ డే సర్ ప్రైజ్ గిఫ్ట్.. అదిరిపోయేలా ప్లాన్ చేసిన సురేఖా వాణి.. ఆనందంలో సుప్రిత!
తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోలు, హీరోయిన్లు ఎంతగా ఫేమస్ అవుతుంటారో.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లు కూడా అంతే ఫేమస్ అవుతుంటారు. లేడీ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లో ప్రగతి, సుధ, సురేఖా వాణి వంటి వారు ఈ జనరేషన్‌కు ఎంతో బాగా దగ్గరైన వారు. మరీ ముఖ్యంగా సురేఖా వాణి అయితే కామెడీ అయినా, ఎమోషనల్ క్యారెక్టర్స్ అయినా సరే తనదైన శైలిలో సన్నివేశాలను పండిస్తుంది. కేవలం వెండితెరపైనే కాకుండా సోషల్ మీడియాలోనూ ఓ రేంజ్‌లో రచ్చ చేస్తోంది.

సోషల్ మీడియాలో రచ్చ..
సురేఖా వాణి సోషల్ మీడియాలో చేసే రచ్చ ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టీనేజ్ దాటిన కూతురు ఉన్నా కూడా మరీ యంగ్‌గా కనిపించే సురేఖా వాణి సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. భర్త చనిపోయిన తరువాత కూడా ఇలా రచ్చ చేస్తోందంటూ నెగెటివ్ కామెంట్స్ వచ్చినా ఏ మాత్రం లెక్కచేయలేదు.

కూతురితో వీడియోలు..
టిక్ టాక్ ఓ ఊపులో ఉన్న దశలో సురేఖా వాణి, ఆమె కూతురు సుప్రిత చేసిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేశాయి. లుంగీ కట్టుకుని, కళ్లద్దాలు పెట్టుకుని చేసిన ఓ వీడియో మాత్రం అందర్నీ ఆకట్టుకుంది. అలా కూతరితో కలిసి సురేఖా వాణి చేసిన డ్యాన్సులు, వేసిన స్టెప్పులతోనే మళ్లీ పాపులర్ అయింది.

సినిమాల్లో ఎంట్రీ..
సురేఖ తన కూతుర్ని ఇండస్ట్రీలోకి తీసుకురావాలని ఇలాంటివన్నీ చేస్తోందనే కామెంట్లపై స్పందించింది. సినిమాలకు పరిచయం చేయాలనే ఆసక్తి లేదని, ఒకవేళ తనకు ఇష్టం ఉంటే కాదనని ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. తాజాగా సురేఖ తన కూతురికి బర్త్ డే సందర్భంగా అదిరిపోయే సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చింది.

స్పెషల్ అరేంజ్మెంట్స్..
కూతురి కోసం తన రూం అంతా స్పెషల్‌గా అలంకరించింది. ఈ మేరకు ఇలాంటి ఈవెంట్‌లు చేసే సంస్థకు బాధ్యతను అప్పగించినట్టు తెలుస్తోంది. కూతురి కోసం అన్నీ సిద్దంగా చేసి ఉంచి.. కళ్లు మూసి తన రూం వద్దకు తీసుకెళ్లి ఒక్కసారిగా చూపించింది. అక్కడున్న చిన్న కుక్కు పిల్లను చూసి సుప్రిత ఆనందానికి అవధుల్లేకుండా పోయాయ్.
Recommended Video

లవ్లీ గాడు..
కూతురు బర్త్ డే సందర్భంగా ఎమోషనల్ అయిన సురేఖా వాణి సోషల్ మీడియాలో స్పందిస్తూ.. ‘నా చిన్ని యువరాణికి హ్యాపీ బర్త్ డే. నువ్వే నా బలం, బలహీనత. నిన్ను, నీ వ్యక్తిత్వాన్ని ప్రతీ ఒక్కరూ ఇష్టపడతారు. నువ్ నీలాగే ఉండు. మీ డాడీ అక్కడి నుంచి చూస్తుంటాడు.. నీ వెంటే ఉంటాడు. నా సర్వస్వం నువ్వే. గాడ్ బ్లెస్ యూ సుప్రిత లవ్లీ గాడు.. ఐ లవ్ యూ.. ఎంజాయ్ చేయ్ కన్నా' అంటూ పోస్ట్ చేసింది.


Click it and Unblock the Notifications











