'కిక్' సురేంద్రరెడ్డి కి బాలీవుడ్ ఆఫర్ కన్ఫర్మ్
"అతనొక్కడే" సురేంద్రరెడ్డి ఆ తర్వాత అశోక్ తో బోల్తా కొట్టినా "కిక్" తో మళ్ళీ తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు. రీసెంట్ గా సల్మాన్ ఖాన్ చిత్రం డైరక్ట్ చేయటానికి కమిటయ్యాడు. ఆగస్టు 2011 నుంచి ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ళనుంది. ఈ మేరకు రెండు సిట్టింగ్స్ వరకూ జరిగాయని తెలుస్తోంది. పోకిరి రీమేక్ వాంటెడ్ హిట్ అయిన దగ్గరనుండి సల్మాన్ ఖాన్ దృష్ఠి మొత్తం సౌత్ ఇండియన్ సినిమాలపై పడింది. ప్రస్తుతం శ్రీని వైట్ల దర్శకత్వంలో వచ్చి హిట్టయిన రెడీ చిత్రం రీమేక్ లో చేస్తున్నాడు. ఇక కిక్ చిత్రం చూసిన సల్మాన్..దర్శకుడు టేకింగ్ కి చాలా ఆసక్తి చూపించాడని, అతన్ని ముంబై పిలుపించుకుని మాట్లాడి ప్రాజెక్టు ఓకే చాసడని సమాచారం. ఇక సురేంద్రరెడ్డి, ఎన్టీఆర్ కాంబినేషన్ లో త్వరలో రచ్చ అనే టైటిల్ తో ఓ చిత్రం రూపొందనుంది.
సురేంద్రరెడ్డి జూ ఎన్టీఆర్ సల్మాన్ ఖాన్ అతనొక్కడే భోగవల్లి ప్రసాద్ రచ్చ jr ntr surender reddy salman khan athanokkede bhogavalli prasad


Click it and Unblock the Notifications