హాంగ్ కాంగ్ లో సురేందర్ రెడ్డి
అతనొక్కడే, అశోక్, అతిథి సినిమాలకు దర్శకత్వం వహించిన యువ దర్శకుడు సురేందర్ రెడ్డి ఇపుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయిపోయాడు. తీసింది మూడు సినిమాలే... అందులో అశోక్ అనుకున్న విజయం సాధించలేదు కానీ సురేందర్ రెడ్డి ఇచ్చే స్టేట్ మెంట్లు మీడియావారికి మంటపెట్టినట్టుగా ఉంటున్నాయని చాలామంది మీడియా మిత్రులు ఆయన పట్ల గుర్రుగా ఉన్నారు. అయితే స్టేట్ మెంట్లు ఎలా ఉన్నా హీరోలు మాత్రం ఆయన దర్శకుడయితే బావుండు అనే ఎక్కువగా అనుకుంటున్నారు.
ఇది సరే. సురేందర్ రెడ్డి ఇవన్నీ పట్టించుకుంటున్నాడో లేదో తెలియదు కానీ ఆయన దీపావళిని మాత్రం హాంగ్ కాంగ్ లో చేసుకోనున్నాడు. అపుడే ఆయన అక్కడికి చేరుకున్నాడు కూడా. ప్రయాణాలంటే బాగా ఇష్టపడే సురేందర్ రెడ్డి దీపావళి టపాకాలను హాంగ్ కాంగ్ లో పెల్చనున్నాడన్నమాట.


Click it and Unblock the Notifications











