»   » 'రేసు గుర్రం' : అల్లు అర్జున్ రేసు దేని కోసం?

'రేసు గుర్రం' : అల్లు అర్జున్ రేసు దేని కోసం?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం 'రేసు గుర్రం'. సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి కలయికలో వస్తున్న తొలి సినిమా ఇదే. నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), డా.కె.వెంకటేశ్వరరావు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్ పై మంచి అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రంలో అల్లు అర్జున్ పోలీస్ ఆఫీసర్ పాత్రను పోషిస్తున్నారని సమాచారం. సోమవారం రామోజీ ఫిల్మ్‌సిటీలో అల్లు అర్జున్‌ మరికొంత మంది ఫైటర్లపై యాక్షన్‌ ఘట్టాల్ని తెరకెక్కించారు. వీటికి రామ్‌లక్ష్మణ్‌ నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రం గురించి మాట్లాడారు.

సురేంద్రరెడ్డి మాట్లాడుతూ..."గెలుపు కోసం బరిలో దిగినవాడికి... లక్ష్యం మాత్రమే కనిపించాలి. ఎదురొస్తున్న సవాళ్లు, పరిగెట్టిస్తున్న పరిస్థితులు, చుట్టుముడుతున్న సమస్యలూ ఇవేమీ పట్టించుకోకూడదు. రేసులో నిలవాలన్నా, నిలిచి గెలవాలన్నా పోరాడాల్సిందే. ఆ యువకుడూ అదే చేశాడు. 'రేసు గుర్రం'లా దూసుకుపోయాడు. మరి విజయం అందిందా? లేదా? ఇంతకీ ఈ రేసు దేని కోసం? తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే!" అన్నారు

ఇక మంగళవారం నుంచి హైదరాబాద్‌ నగర శివార్లలో మరో పోరాట ఘట్టాన్ని చిత్రీకరిస్తారు.నిర్మాతలు మాట్లాడుతూ "బన్ని కెరీర్‌లో ఫుల్‌లెంగ్త్ ఎంటర్‌టైనర్‌గా నిలుస్తుంది. ఆద్యంతం నవ్వులు పండిస్తూనే ఉంటుంది. మా రేసుగుర్రం విశేషాలు ఇంకా తెలుసుకోవాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే. వినోదం, యాక్షన్‌ మేళవించిన కథ ఇది. టైటిల్‌కి తగ్గట్టే.. హుషారుగా సాగిపోతుంది'' అని అన్నారు.
ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందిస్తున్నారు.


సంక్రాంతికి 'రేసుగుర్రం'ను బరిలో దించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇద్దరమ్మాయిలతో... సినిమా బాక్సాఫీస్‌ వద్ద పరాజయం చెందిన తరువాత బన్ని చేస్తున్న సినిమా ఇది. ఈ సినిమాతో ఎలాగైనా హిట్‌ కొట్టాలని భావిస్తున్నాడు. అలాగే ఊసరవెల్లి సినిమా తరువాత సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో వస్తున్న సినిమా ఇది. ఇతనికీ ఈ సినిమా విజయం ఎంతో అవసరం ఉంది. ఎందుకంటే ఊసరవెల్లి అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది.ఈ చిత్రంలో సలోని సెకండ్ హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ చిత్రానికి కథ : వక్కతం వంశీ, సంగీతం : తమన్, సినిమాటోగ్రఫీ : మనోజ్ పరమహంస, ఎడిటింగ్ : గౌతం రాజు, నిర్మాతలు : నల్లమలుపు శ్రీనివాస్, వెంకటేశ్వర రావు, దర్శకత్వం : సురేందర్ రెడ్డి.

English summary
Race Gurram happens to be the next biggest outing of Allu Arjun after the release of his hit movie Iddarammayilatho. Surendar Reddy, who has earlier directed movies like Kick and Oosaravelli, is working with Bunny in this film. The director is leaving no stone unturned to make this project big in his career. Meanwhile, he has also kept most of the aspects of the film under wraps.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu